Begin typing your search above and press return to search.

#స్వీట్ మెమ‌రీ.. ఇది పెళ్లి త‌ర్వాత తొలి ముద్దు

By:  Tupaki Desk   |   15 April 2022 7:30 AM GMT
#స్వీట్ మెమ‌రీ.. ఇది పెళ్లి త‌ర్వాత తొలి ముద్దు
X
ప్రియురాలే పెళ్లాం అయితే ఆ కిక్కే వేరు! అందులోంచి పుట్టుకొచ్చే మ‌జా మ‌రో లెవ‌ల్లో ఉంటుంది. ఇదిగో అలాంటి కిక్కు ర‌ణ‌బీర్ లో క‌నిపిస్తోంది. అలా అలియా భట్ పెద‌విని ప్రేమ‌గా చుంబించాడు. ఆనందం హ‌ద్దులే చెరిపేసాడు. ఇది పెళ్లి త‌ర్వాత తొలి ముద్దు.

ఆలియా వెంట‌నే సోషల్ మీడియాల్లో భర్త రణబీర్ కపూర్ తో మొదటి ఫోటోలను పంచుకుంది. 'మరిన్ని జ్ఞాపకాలను నిర్మించడానికి వేచి ఉండలేను'. అలియా భట్ మరియు రణబీర్ కపూర్ గురువారం ముంబైలో సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సంద‌ర్భంగా అలియాభ‌ట్ క్యాప్ష‌న్ లో ఇలా రాసుకొచ్చారు.

"ఈ రోజు మా కుటుంబం - స్నేహితుల చుట్టూ- ఇంట్లో ... మా ఇష్టమైన ప్రదేశంలో పెళ్లి జ‌రిగింది. మా సంబంధంలో గత 5 సంవత్సరాలుగా మేము గడిపిన బాల్కనీలోనే వివాహం చేసుకున్నాము. చాలా అరుదైన‌..మ‌ధుర‌మైన ఘ‌ట్టమిది.

ఇప్పటికే పెళ్లి ఆల‌స్య‌మైంది. ఆ విష‌యంలో ఇద్ద‌రం చాలా వెనుకబడి ఉన్నాం. మేము కలిసి మరిన్ని జ్ఞాపకాలను నిర్మించుకోవడానికి సిద్దంగా ఉన్నాము.

ఆ గ‌డియుల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ప్రేమ..నువ్వు.. సౌకర్యవంతమైన నిశ్శబ్దాలు వంటి వారు. సినిమా రాత్రులు.. వెర్రి పోరాటాలు.. వైన్ డిలైట్‌లు - చైనీస్ కాటులతో నిండిన జ్ఞాపకాలు . ఇలా నీతో గ‌డిపిన ప్ర‌తీక్ష‌ణం ఎంతో అద్భుత‌మైన‌ది. మా జీవితంలోని ఈ అత్యంత ముఖ్యమైన ఘ‌ట్టం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనిది. ఈ క్షణం మరింత ప్రత్యేకంగా మారింది. 'ల‌వ్ ర‌ణ‌బీర్ అండ్ అలియా' అని అలియాభ‌ట్ త‌న ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చారు.

ఇక న‌వ దంప‌తులు ఈనెల 17న ముంబైలో రిసెప్షన్ ముగించుకుని హ‌నీమూన్ వెళ్ల‌నున్నారు. హ‌నీమూన్ ని ఆప్రికా ఖండంలో ప్లాన్ చేసారు. ప్రేమికులుగా ఉన్న‌ప్పుడే ఈ జంట ఆఫ్రికాలో ఎక్కువ విహ‌రించారు. అందుకే బాగా తెలిసిన ప్ర‌దేశం అయితే బాగుంటుంద‌ని హ‌నీమూన్ అక్క‌డ ప్లాన్ చేసుకున్నారు.