Begin typing your search above and press return to search.

అస‌లు బ‌రువు త‌గ్గాల్సిన అవ‌స‌రమే లేదు!

By:  Tupaki Desk   |   6 Dec 2019 9:33 AM GMT
అస‌లు బ‌రువు త‌గ్గాల్సిన అవ‌స‌రమే లేదు!
X
స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి పై ర‌క‌ర‌కాల రూమ‌ర్ల గురించి తెలిసిందే. స్వీటీ మ‌ళ్లీ బ‌రువు పెరిగింది. త‌గ్గేందుకు సిట్టింగ్స్ కోసం ఆస్ట్రియా వెళ్లింది అంటూ తాజాగా ప్ర‌చార‌మైంది. మొన్న హైద‌రాబాద్ లో జ‌రిగిన నిశ్శ‌బ్ధం ప్రెస్ మీట్ స్కిప్ కొట్ట‌డంతో స్వీటీపై ఈ త‌ర‌హా ప్రచారం అభిమానుల్లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది.

ఇది నిజ‌మేనా? అంటే తాజాగా అనుష్క త‌ర‌పున ప్ర‌తినిధులు స్పందించారు. స్వీటీపై జ‌రిగిన ప్ర‌చారం ఉత్తుత్తి ప్ర‌చార‌మే. అందులో ఎలాంటి నిజం లేదు. అయినా అనుష్క ఈ ఏజ్ లో బ‌రువు త‌గ్గాల్సిన అవ‌స‌రం లేదు. త‌ను ఇప్ప‌టికే స్లిమ్ గానే ఉంది! అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు. అంతేకాదు.. జ‌న‌వ‌రి చివ‌రిలో త‌ను న‌టించిన `నిశ్శ‌బ్ధం` రిలీజ‌వుతోంది. అప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌చారం చేయ‌డం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు మీడియా మీట్ కి పిల‌వ‌లేద‌ని వెల్ల‌డైంది. ఇక త‌న‌పై జ‌రిగిన ప్ర‌చారం విష‌యంలో ఎలాంటి బాధ‌ను స్వీటీ వ్య‌క్తం చేయ‌డం లేద‌ట‌.

మొత్తానికి అందాల అనుష్క‌ను టార్గెట్ చేస్తూ సాగించిన ఆ ప్ర‌చారం ఉత్త ప్ర‌చార‌మేన‌ని తేలింది. నిశ్శ‌బ్ధం మీడియా స‌మావేశంలో మ‌రోసారి స్వీటీనే ఈ రూమ‌ర్ల‌పై స్పందిస్తుందేమో చూడాలి. ఇక అనుష్క పెళ్లెప్పుడు? అన్న‌దానిపైనా అభిమానుల సందేహాల్ని ప‌క్కాగా క్లియ‌ర్ చేస్తుందేమో? నిశ్శ‌బ్ధం త‌ర్వాత తాను న‌టించే ప్రాజెక్టుల‌పైనా వివ‌రాలు చెబుతుందేమో చూడాలి.