Begin typing your search above and press return to search.

విడాకుల‌పై శ్వేత‌బ‌సు ఫిలాస‌ఫీ

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:32 AM GMT
విడాకుల‌పై శ్వేత‌బ‌సు ఫిలాస‌ఫీ
X
అందాల క‌థానాయిక శ్వేతాబ‌సు ప్ర‌సాద్ రియ‌ల్ లైఫ్ డ్రామా గురించి తెలిసిందే. బాల‌న‌టిగా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన‌ శ్వేతాబ‌సు చాలా త‌క్కువ స‌మ‌యంలో చ‌క్క‌ని న‌టి అన్న‌ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఊహించ‌ని రీతిలో కొన్ని ఘ‌ట‌న‌లు త‌న లైఫ్ నే డైల‌మాలోకి నెట్టేశాయి. కొన్ని నీలాప‌నింద‌లు ఎదుర‌య్యాయి. అనంత‌రం త‌న స్నేహితుడు.. బాలీవుడ్ డైరెక్ట‌ర్ రొహిత్ మిట్ట‌ల్ శ్వేతాబ‌సుని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శ్వేత రియ‌ల్ లైఫ్ కీల‌క మ‌లుపులో అత‌డు అండ‌గా నిలిచాడు. తాను వ్య‌క్తిగ‌తంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న‌ స‌మ‌యంలో రోహిత్ త‌న‌ని ఆదుకున్నాడు. స్నేహితుడి సాహ‌చ‌ర్యంలోనే తిరిగి కొత్త ప్ర‌పంచంలోకి రాగ‌లిగింది. అయితే ఆ ఇద్ద‌రి బంధం ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. అత‌డితో అభిప్రాయ బేధాలు రావ‌డం తో పెళ్లాడిన ఏడాదికే విడిపోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ శ్వేతాబ‌సు స్పందించ‌ లేదు.

తాజాగా అందుకు కార‌ణాల్ని శ్వేతాబ‌సు వెల్ల‌డించింది. ఒక ర‌కంగా పెద్ద పిలాస‌ఫీనే చెప్పింది. మేం ఇరువురం ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం. ప్ర‌తి పుస్త‌కాన్ని మొదటి పేజీ నుంచి చివ‌రి పేజీ వ‌ర‌కూ ఒకే విధంగా చ‌ద‌వ‌లేం. తొలి పేజీ చ‌దివినంత ఆస‌క్తి చివ‌రి వ‌ర‌కూ ఉండ‌దు. అంత మాత్రాన ఆ పుస్త‌కం స‌రైన‌ది కాద‌ని అన‌లేం. మా జీవితం ఓ అసంపూర్ణమైన‌ పుస్త‌కం లాంటిది`` అని వ్యాఖ్యానించింది. రోహిత్ నుంచి తాను దూర‌మైనా మంచి స్నేహితుల్లా ఉంటామ‌ని తెలిపింది. దీంతో శ్వేత వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌నులు ర‌క‌ర‌కాల‌ కామెంట్ల తో విరుచుకు ప‌డుతున్నారు.

పెళ్లి.. జీవితం.. విడి పోవ‌డం గురించి అప్పుడే అన్ని విష‌యాలు తెలుసుకున్నావా? జీవితాన్ని అసంపూర్ణ‌ పుస్త‌కంతో ముడి పెడ‌తావా? అంటూ కొంద‌రు నెటిజ‌నులు మండి ప‌డుతున్నారు. పెళ్లిళ్లు చేసుకుని క‌లిసి ఉంటున్న వారంతా... ఆ పుస్త‌కాన్ని ప‌రిపూర్ణంగా చ‌ద‌వ‌లేదంటావా? ఆ పుస్త‌కం పై అంత శ్ర‌ద్ద లేకుండానే చివ‌రి వ‌ర‌కూ క‌లిసి ఉంటున్నారని అంటావా! అంటూ త‌న‌ వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్లు వేస్తున్నారు. `కొత్త బంగారులోకం ` సినిమాతో శ్వేత‌బ‌సు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం. నాలుగైదేళ్ల పాటు నాయిక‌గా కెరీర్ ని సాగించింది. అటుపై స‌రైన అవ‌కాశాల్లేక‌ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే.