Begin typing your search above and press return to search.
శ్వేతాబసు ప్రసాద్ విడాకులు
By: Tupaki Desk | 10 Dec 2019 6:54 AM GMT`కొత్త బంగారు లోకం` ఫేం శ్వేతాబసు ప్రసాద్ లైఫ్ ట్రామా గురించి తెలిసిందే. చాలా చిన్న వయసులో స్టార్ అయ్యింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి కథానాయిక గా ఎదిగింది. స్టార్ గా తనని తాను నిరూపించుకుంది. ఉత్తరాదితో పాటు దక్షిణాదినా ఈ భామకు అభిమానులేర్పడ్డారు. అయితే ప్రతిదీ అనుకున్నట్టు సాగకపోవడమే లైఫ్. శ్వేతాబసు లైఫ్ జర్నీ.. కెరీర్ ప్రతిదీ ఊహించని కుదుపులకు లోనైంది.
ముఖ్యంగా టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఎదుగుతుందని భావించిన శ్వేతపై వ్యభిచారం ఆరోపణలు.. అరెస్ట్ అనంతర పరిణామాలు తన లైఫ్ నే డైలమాలోకి విసిరేసిన సంగతి తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణల్ని శ్వేత ఖండించినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అనంతరం ఈ భామ పూర్తిగా పరిశ్రమకు దూరమై లఘు చిత్రాలు డ్యాక్యుమెంటరీలతో కాలక్షేపం చేసింది. అనురాగ్ బసు లాంటి గురువుతో కలిసి పలు చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసింది.
ఆ క్రమంలోనే శ్వేతాబసు 2018 లో తన బోయ్ ఫ్రెండ్ రోహిత్ మిట్టల్ ని వివాహమాడింది. ఏడాది కాపురం బాగానే సాగింది. ఇంతలోనే ఏమైందో శ్వేతబసు ఊహించని షాకింగ్ ప్రకటనతో సోషల్ మీడియాల్ని వేడెక్కించింది. తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా ఈ భామ ప్రకటించింది. సరిగ్గా ఏడాదికే ఫ్యామిలీలో కలతలతో ఈ నిర్ణయం తీసుకోవడం క్షణాల్లో వైరల్ గా మారింది.
2018 డిసెంబర్ 13న పూణేలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో రోహిత్- శ్వేతాబసు జంట వివాహం జరిగింది. 2019 డిసెంబర్ 13 నాటికి ఏడాది అవుతుంది. అంతకుముందే శ్వేత నుంచి ఈ ప్రకటన రావడం తన లైఫ్ లో మరో కుదుపు అనే చెప్పాలి. ఎక్స్ హబ్బీ రోహిత్ తో మర్చిపోలేని ఎన్నో తీపి గురుతులు ఉన్నాయని.. తనలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతాడని శ్వేతాబసు సోషల్ మీడియా పోస్టింగ్ లో వ్యాఖ్యానించింది