Begin typing your search above and press return to search.

శ్వేత బసు.. బ్యాక్ టు రూట్స్

By:  Tupaki Desk   |   28 Oct 2015 3:30 PM GMT
శ్వేత బసు.. బ్యాక్ టు రూట్స్
X
శ్వేత బసు ప్రసాద్.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లకు కూడా రాని గుర్తింపు వచ్చింది ఈ అమ్మాయికి. కానీ ఆ గుర్తింపు మంచి కారణాలతో రాలేదు. వ్యభిచారం కేసు విషయంలో చాలా అప్రదిష్ట మూటగట్టుకుంది శ్వేత. ఈ గొడవ నుంచి తేరుకుని హైదరాబాదుకి టాటా చెప్పేసి ముంబయి వెళ్లిపోయిన శ్వేత.. అక్కడ ఓ ప్రొడక్షన్ హౌజ్ లో స్క్రిప్ట్ కన్సల్టంట్ గా పని చేస్తూ.. ఏదో ఓ డాక్యుమెంటరీ తీసుకుంటూ కాలం గడిపేస్తోంది. శ్వేతకు అవకాశం ఇస్తామన్న టాలీవుడ్ జనాలు.. ఆమెకు ఆఫర్లు ఇచ్చారో లేదో తెలియదు కానీ.. ఆమె మాత్రం ఇటువైపు చూడటానికి ఇష్టపడట్లేదు.

బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమెకేమీ అవకాశాలు వస్తున్నట్లు లేవు. ఐతే తనకు సెలబ్రెటీ స్టేటస్ సంపాదించిన పెట్టిన టీవీ రంగాన్నే నమ్ముకోవాలని నిర్ణయించుకుంది శ్వేత. బాలనటిగా సినిమాల్లో నటించే సమయంలోనే హిందీలో సీరియళ్లు కూడా చేసింది శ్వేత. ఇప్పుడు మరోసారి ఆమెకు టీవీ రంగం రెడ్ కార్పెట్ వేస్తోంది. ‘దార్ సబ్ కో లగ్ తా హై’ అనే హార్రర్ టీవీ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించబోతోంది శ్వేత. యాక్టింగ్ విషయంలో అమ్మడికి తిరుగులేదు కాబట్టి.. ఈ హార్రర్ సిరీస్ హిట్టయితే టీవీ ఇండస్ట్రీలో పాతుకుపోయే ఛాన్సుంది. ఎలాగైతేనేం శ్వేత ఏదో రకంగా సెటిలైతే సంతోషమే.