Begin typing your search above and press return to search.

కవ్వాలి ఆడుతున్న శ్వేతాబసు..

By:  Tupaki Desk   |   12 Oct 2015 9:23 AM GMT


శ్వేతాబసు.. కొత్త బంగారు లోకంతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఓ సెక్స్ స్కాండల్ లో ఇరుకుని జైలు పాలైనా.. కోర్ట్ నిర్దోషిగా తీర్పునివ్వడంతో ఊపిరి పీల్చుకుంది. మళ్లీ రీఎంట్రీ కోసం బాగానే ట్రై చేస్తున్నా అమ్మడికి సరైన అవకాశం రావడం లేదు. అయితే కొత్త బంగారు లోకం కంటే ముందే... ఈ చిన్నదానికి బాలీవుడ్ లో మంచి పేరుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డ్ దక్కించుకున్న చరిత్ర శ్వేతా బసు ప్రసాద్ ది.

ఇప్పుడీ భామ ఓ వీడియో కమర్షియల్ తో మళ్లీ వార్తల్లో నానుతోంది. ట్రూలీ మ్యాడ్లీ అనే యాప్ కోసం రూపొందించిన యాడ్ లో క్రీపీ కవ్వాళి ఆడే అమ్మాయి యాక్ట్ చేసింది శ్వేతా బసు. ఈ పాటలో శ్వేతాబసు నటించిన కాస్ట్యూమ్స్ నుంచి ఎక్స్ ప్రెషన్స్ వరకూ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో విడుదల చేసిన 3 రోజుల్లోనే 5.83 లక్షల క్లిక్స్ వచ్చాయంటే.. ఈ కమర్షియల్ సత్తా అర్ధమవుతుంది. సింగర్స్ అయిన అదితిపాల్, మన్సీ ముల్తానీ కూడా ఈ వీడియోలో దర్శనమిస్తుండగా... డైరెక్టర్ బాధ్యతలను అధిరాజ్ బోస్ నిర్వహించారు.ప్రస్తుతం బ్యాడ్ టెర్మ్ లో ఉన్న శ్వేతాబసుకు ఈ వీడియో మళ్లీ ఊపునిస్తోంది.

సమాజం నుంచి ఛీత్కారం ఎదురయ్యే పరిణామాల నుంచి.. మళ్లీ పదిమందీ తనను ప్రశంసించేలా ప్రయాణం చేస్తోంది. ఇది ప్రారంభమే అయినా.. మళ్లీ తిరిగి తన పాత స్థాయిని అందుకుంటానంటోంది. పడి లేచిన కెరటంలా తిరిగి పుంజుకుంటున్న శ్వేతాబసు గట్స్ కి హ్యాట్సాఫ్ చెబ్తూ.. బెస్టాఫ్ లక్ చెప్పాల్సిందే.