Begin typing your search above and press return to search.

ఆ రోజేం జరిగిందో విప్పి చెప్పిన శ్వేతబసు

By:  Tupaki Desk   |   16 Oct 2016 5:14 AM GMT
ఆ రోజేం జరిగిందో విప్పి చెప్పిన శ్వేతబసు
X
పరిచయం అక్కర్లేని పేరు.. శ్వేతబసు ప్రసాద్ ది. ఫేం తో పాటు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆమెపైన తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకోవటం మొదలు.. రెస్య్కూ హౌస్ లో ఆమెను ఉంచటం లాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. నిజం.. అబద్ధం లాంటి విషయాల్ని పక్కన పెడితే.. ఒకప్పుడు యువ సంచలనంగా నిలిచిన ఆమె.. ఎన్నిమాటలు పడాలో అన్ని మాటలు పడటాన్ని మర్చిపోలేం.

కలలో కూడా ఊహించని ఆరోపణల మీద అరెస్ట్ అయిన ఆమె.. తర్వాత బయటకు వచ్చినా తెలుగు తెర మీద పెద్దగా కనిపించలేదు. స్టార్ హోటల్లో శ్వేతను అదుపులోకి తీసుకోవటం.. ఎర్రమంజిల్ కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోంకు తరలించటం.. తర్వాత నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. అనంతరం ఆమె తన ఊరికి వెళ్లిపోయారు. ఇదంతా జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది.

ఇదంతా గతం. వర్తమానంలోనూ గతం వెంటాడుతుంది. అందుకేనేమో.. తాజాగా ఆమె ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా.. అసలా రోజు ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. సంతోషం సినీ వార పత్రిక అవార్డుల్లో పాల్గొనటానికి ముంబయి నుంచి వచ్చిన ఆమె.. తర్వాత తాను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యారు.

దీంతో.. ఆమెకు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు. అదే సమయంలో పోలీసులు దాడి చేయటం.. అరెస్ట్ చేయటం లాంటివి జరిగిపోయాయని చెప్పుకొచ్చారు. తనకే మాత్రం సంబంధం లేకున్నా.. ప్రాస్టిట్యూషన్ కేసులో ఏ యాక్టర్ పట్టుబడినా.. శ్వేత పేరుమీద ప్యాకేజీలు వేసే టీవీ ఛానళ్ల తీరుపై స్పందిస్తూ.. ‘‘నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నా పేరుని లాగుతున్నారంటే నేను పాపులర్ అని అర్థం. నా పేరు స్పెల్లింగ్ బాగుందనీ.. నా ఫోటోలు బాగున్నాయని అర్థం. నన్ను ఎగ్జాంఫుల్ గా తీసుకునే వారి గురించి వదిలేద్దాం. మీడియా నాకు సపోర్ట్ గా ఉంది. కొత్త ప్రాజెక్టులు ఓకే అయితే కంగ్రాట్స్ అంటున్నారు. నా మంచి కోరుకునే వారు చాలామందే ఉన్నారు. నాకు వాళ్లు చాలు. ఎవరేం మాట్లాడుకున్నా పట్టించుకోను. అదే పనిగా మాట్లాడేవారి నోళ్లను మూయించలేం. ఎవరి సంస్కారం వారిది’’ అని వ్యాఖ్యానించారు.

కేసు గురించి మరో సందర్భంలో శ్వేత మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో జరగకూడనిది జరిగినప్పుడు నా కంటి నుంచి ఒక్క చుక్క రాలేదు. నాకు ఏడవటం అస్సలు ఇష్టం ఉండదు. కోర్టు గురించి ఒక విషయం చెప్పాలి. ఇండియాలో ఏ కేసుకైనా తీర్పు దొరకాలంటే ఏళ్లు పడుతుంది. కానీ.. నిందితురాలిగా ముద్రపడి.. కోర్టు ముందుకు వచ్చిన రెండే వారాల్లో నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వగానే నాకు మొదట శుభాకాంక్షలు చెప్పింది హైదరాబాద్ పోలీసే. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతా ఇంకా విషయం గురించి ఏదేదో మాట్లాడుతున్న వాళ్లను పూలిష్ అనటం మినహా నేనేం చేయలేదు’’ అని చెప్పుకొచ్చారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/