Begin typing your search above and press return to search.
వివాదాల నటి కాకినాడలో తేలింది
By: Tupaki Desk | 16 Dec 2015 5:24 AM GMTబాల నటిగా రాణించి కథానాయికగా అవకాశాలు అందుకుంది శ్వేతాబసు. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యింది. ఎకడా .. అని దీర్ఘం తీస్తూ... తూ.గో యాసలో మాట్లాడుతూ .. యూత్ లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తొలి ప్రయత్నమే పెద్ద సక్సెస్. అదే ఊపులో వరుసగా తెలుగు సినిమాల్లో ఎడాపెడా నటించేసింది. అయితే వాటిలో ఏవీ పెద్దగా సక్సెస్ సాధించలేదు. దాంతో కెరీర్ గాడితప్పింది. చుట్టూ ఉన్న జనం తనని ఓ ప్రమాదకర ఊబిలోకి దింపేశారు.
నాడు తాను ఊహించి ఉండదు. అది తన కెరీర్ ని, జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తుందని. ఏదేమైనా అది గతం. వర్తమానంలో శ్వేతా బసు ప్రసాద్ ఏం చేస్తోంది? అంటే దానికి సమాధానమే లేదు. అప్పట్లో అనురాగ్ కశ్యప్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. కాలక్రమంలో మ్యూజిక్ పై ఓ డాక్యుమెంటరీ తీస్తూ బిజీగా ఉన్నానని చెప్పింది. తనపై జరిగిన రచ్చ విషయంలో తన తప్పేమీ లేదని హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వాదించేది. ప్రస్తుతం గత విషయాలన్నీ జనాలు మర్చిపోయారు. అయితే ఈలోగానే ఇదే అదను అని నిన్నటిరోజున కాకినాడలో తేలింది. అక్కడ ఓ బట్టల దుకాణం వేసిన స్కీమ్ కి ప్రమోషన్ చేసింది. శరవణ సిల్క్స్ క్రిస్మస్, సంక్రాంతి సేల్ అంటూ కొత్త స్కీమ్ కి ప్రచారం చేసే పని తన నెత్తిన వేసుకుంది. కొత్త బంగారు లోకం యూనిట్ తో కలిసి వచ్చాను. కాకినాడ కాజా అంటే చాలా ఇష్టం.. అంటూ చెప్పుకొచ్చింది ఈ సొగసరి.
అన్నట్టు శ్వేతబసుకి అండగా నిలుస్తాం. తను ఓకే అంటే సినిమాలు తీస్తాం అంటూ మన టాలీవుడ్ హీరోలు కం ప్రొడ్యూసర్లు అప్పట్లో డబ్బాలు కొట్టారు. కానీ అవకాశాలైతే ఇవ్వలేదెందుకో? మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవాల్సిందేనా? ఈరోజుల్లో మోరల్ సపోర్ట్ అంటే ఓ అవకాశం ఇచ్చి చెక్కు చేతిలో పెట్టడమే. మరి సదరు ఆఫర్ ఇచ్చినవారికి ఆ మాత్రం తెలీదా?