Begin typing your search above and press return to search.
శ్వేత బసు మళ్లొస్తోంది
By: Tupaki Desk | 15 Aug 2015 8:17 PM GMTమళ్లీ వస్తోందంటే టాలీవుడ్ కు వచ్చేస్తోందని కాదు. సినిమాల్లోకి పునరాగమనం చేస్తోందని. శ్వేతకు అవకాశమిస్తామని అప్పట్లో ప్రకటించిన విష్ణు, తేజ లాంటి వాళ్లు పిలిచినా అప్పటి గొడవను దృష్టిలో పెట్టుకుని మళ్లీ హైదరాబాద్ లో అడుగుపెట్టొద్దని డిసైడైనట్లుంది శ్వేత బసు. ఐతే హిందీ సినిమాల్లో.. అందులోనూ ఆఫ్ బీట్, ఆర్ట్ మూవీస్ లో చేయడానికి ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ చాలా ఆసక్తిగా ఉందట. ప్రస్తుతం స్క్రిప్ట్ అసిస్టెంట్ గా ఓ ఫిలిం మేకర్ దగ్గర పని చేస్తున్న శ్వేత బసు ప్రసాద్ కు అలాంటి అవకాశాలే తలుపు తడుతున్నాయట. ఈ మధ్యే ‘ఆల్ ఇండియా బ్యాచ్ చాడ్’ అనే షార్ట్ ఫిలిం ఒకటి చేసింది శ్వేత. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
దీని తర్వాత ఓ ఫీచర్ ఫిలింకు కూడా ఓకే చెప్పింది శ్వేత. ఇంకా పేరు పెట్టని ఆ హార్రర్ థ్రిల్లర్ కు అమిత్ ఖన్నా దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా శ్వేత మాతృభాష మరాఠితో పాటు బెంగాలీలో కూడా తెరకెక్కబోతోంది. నాశిక్, కోల్ కతా లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారు. ఇది అవార్డుల్ని లక్ష్యంగా చేసుకుని ఓ ఉదాత్తమైన కథాంశంతో తీస్తున్న సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమాకు స్క్రిప్టు విషయంలోనూ శ్వేత సహకారం అందించిందట. చైల్డ్ ఆర్టిస్ట్ గానే నేషనల్ అవార్డు తీసుకున్న శ్వేత ఈ సినిమాతో ఇంకో అవార్డు ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం శ్వేత క్లాసిక్ మ్యూజిక్ మీద ‘రూట్స్’ పేరుతో స్వయంగా ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తుండటం విశేషం. చూస్తుంటే హైదరాబాద్ లో చేదు అనుభవం తర్వాత శ్వేత కెరీర్ మంచి టర్న్ తీసుకుంటున్నట్లుంది.