Begin typing your search above and press return to search.
మిస్సెస్ ఇండియా పోటీలో అజయ్ వైఫ్
By: Tupaki Desk | 29 Jun 2017 5:58 AM GMTతెలుగు సినిమాలో కారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న అతి కొద్ది యువ నటులులలో అజయ్ ఒకడు అని చెప్పుకొవచ్చు. విక్రమార్కుడు సినిమాలో విలన్ గా చేసి తెలుగు సినిమాలో ఒక కొత్త తరం ప్రతినాయకుడుగా కారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే బిజీగా ఉన్నాడు. ఇతను కొన్నిసార్లు హీరోగా కూడా ప్రయత్నాలు చేశాడు కానీ అవి ఏవి అంత చెప్పుకోతగ్గ సినిమాలుగా మిగలలేదు. జనతా గ్యారేజ్ - కాటమరాయడు వంటి బడా సినిమాల్లో కూడా నటించి తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు అజయ్ భార్య కూడా సినిమాలలో నటించబోతుందో ఏమో అని డౌట్ గా ఉంది.
అజయ్ భార్య శ్వేత రావూరి అందంతో పాటు ఫిట్ గా కూడా ఉంటుంది. అందుకే ఈ సారి జరుగుతున్నా మిసెస్ ఇండియా 2017 పోటీలో పోటీపడింది. పోటీపడతమే కాకుండా ఫైనల్ రౌండ్ వరకు చేరుకుంది కూడాను. ఈ ఫలితాలు తెలియగానే అజయ్ భార్య శ్వేత క్షణం ఆలోచించకుండా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని ఆమె స్నేహితులతో పంచుకుంది. తన భర్త సపోర్ట్ ఈ విజయంలో మరవలేనిది అని తెగ పొగిడేస్తోంది. ఆమె ఫిట్నెస్ కోసం చాల కష్టపడింది అని చెబుతున్నారు ఆమె ఫ్రెండ్స్. పెళ్లి అయికా కూడా ఇలాంటి పోటీలుకు వెళ్ళి విజయం సాధించడం అంటే కొంచం ఇప్పుడు ఉన్న వాతావరణంలో కష్టమే అనే చెప్పాలి. నా విజయానికి కారణం మాత్రం నా భార్తే అని గర్వంగా చెబుతుంది శ్వేత.
అజయ్ శ్వేత పెళ్లి 2006లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా మాంచి చిచ్చరపిడుగులే. ఫైనల్ లిస్ట్ లో శ్వేత ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి.. ఒకవేళ మిస్సెస్ ఇండియా కిరీటం గెలిస్తేనా.. ఆ కిక్కే వేరబ్బా. గతంలో మరో తెలుగు తేజం.. మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఇదే తరహాలో మిస్సెస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/