Begin typing your search above and press return to search.

సై ద‌ళ‌ప‌తి.. నిప్పు క‌నిక నువ్వు..

By:  Tupaki Desk   |   10 Jan 2023 4:35 PM GMT
సై ద‌ళ‌ప‌తి.. నిప్పు క‌నిక నువ్వు..
X
త‌మిళ స్టార్ విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా `వారీసు`. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మిస్తూ తొలి తొలిసారి త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇదే మూవీని తెలుగులో `వార‌సుడు` పేరుతో రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని చివ‌రి క్ష‌ణంలో మార్చేశారు. జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌ని ముందు అనుకున్నా చివ‌రి క్ష‌ణంలో 12 నుంచి 14 కు పోస్ట్ పోన్ చేసిన విష‌యం తెలిసిందే.

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీని ముందు నుంచి జ‌న‌వ‌రి 12నే రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు అనుకున్నారు. రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. అంతే కాకుండా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోసం భారీ స్థాయిలో థియేట‌ర్ల‌ని నిర్మాత దిల్ రాజు బ్లాక్ చేసి పెట్టుకున్నాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో సంక్రాంతి బ‌రిలో తెలుగు సినిమాల‌కు థియేట‌ర్లు ల‌భించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఈ నేప‌థ్యంలో దిల్ రాజు ప్ర‌త్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ `వార‌సుడు` మూవీని వాయిదా వేస్తున్నామంటూ ఫైన‌ల్ గా ప్ర‌క‌టించారు. ముందు అనుకున్న 12న కాకుండా ఈ మూవీని జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. అయితే జ‌న‌వ‌రి 12, 13న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `వీర సింహారెడ్డి`, వాల్తేరు వీర‌య్య సినిమాలు రిలీజ్ అవుతున్న కార‌ణంగానే విజ‌జ్ఞ్ `వార‌సుడు` మూవీని దిల్ రాజు జ‌న‌వ‌రి 14కు మార్చేశాడ‌నే గుస గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ మూవీ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేశారు. ఇందులో భాగంగానే మంగ‌ళ‌వారం ఈ మూవీలోని `సై ద‌ళ‌ప‌తి` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. విజ‌య్ ని ట్రోల్ చేసే వారికి విజ‌య్ గొప్ప‌ద‌నాన్ని చాటి చెబుతూ ఈ పాట‌ని రాయించారు. ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఈ పాట‌ని పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ అంథెంమ్ గా ఈ పాటని రూపొందించారు.

త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా దీప‌క్ బ్లూ, అర‌వింద్ శ్రీ‌నివాస‌న్‌, ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట నెట్టింట ట్రెండ్ అవుతూ విజ‌య్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.