Begin typing your search above and press return to search.
‘సైరా’లో నటిస్తున్న విదేశీయుడి హఠాన్మరణం
By: Tupaki Desk | 16 May 2019 8:23 AM GMTహైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఎండ వేడి తాళలేక వడదెబ్బకు గురై ఓ విదేశీయుడు ప్రాణాలు వదిలాడు. రష్యాకు చెందిన ఆ వ్యక్తి పేరు అలెగ్జాండర్. అతను మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నట్లు వెల్లడైంది. టూరిస్టు వీసా మీద ఈ ఏడాది ఆరంభంలో అతను ఇండియాకు వచ్చాడు. ‘సైరా’ చిత్రీకరణకు హాజరయ్యాడు. కడపలో జరిగిన ఈ సినిమా షెడ్యూల్లో అతను పాల్గొన్నాడు. ఐతే ప్రస్తుతం అతడి పాత్ర చిత్రీకరణ పూర్తయింది లేనిదీ తెలియడం లేదు. ఐతే హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఒక అపార్ట్ మెంట్లోో ఉంటున్న అతను వడ దెబ్బకు గురయ్యాడు.
హైదరాబాద్ లో రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అతను తాళలేక పోయినట్లు తెలుస్తోంది. తన అపార్ట్ మెంట్ దగ్గర అపస్మారక స్థితిలో ఉన్న అలెెగ్జాండర్ ను స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా అలెగ్జాండర్ ప్రాణాలు కాపాడలేకపోయారు. అలెగ్జాండర్ మిత్రుడైన బోరెజ్ అనే వ్యక్తి కూడా రష్యా నుంచి ఇండియాకు వచ్చినట్లు వెల్లడైంది. గోవాలో ఉన్న అతడిని పోలీసులు హైదరాబాద్ కు పిలిపించారు. మృతదేహాన్ని అతడికి అప్పగించి మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు కొంచెం నయమే అనిపిస్తోంది. అయినా అలెగ్జాండర్ తట్టుకోలేక వడదెబ్బకు గురి కావడం విచారకర విషయమే. అలెగ్జాండర్ ఫొటోగ్రాఫర్ కూడా అని తెలిసింది. అతడి దగ్గర ఉన్న కెమెరాను పరిశీలించగా.. ‘సైరా’ షూటింగ్ సందర్భంగా తీసుకున్న ఫొటోలు బయటపడ్డాయి. కడపలో జరిగిన షెడ్యూల్లో అతను పాల్గొన్నట్లు ఈ కెమెరా ద్వారానే తెలిసింది.