Begin typing your search above and press return to search.

సైరా: కలెక్షన్లే కాదు..బ్రేక్ ఈవెన్ ఫిగర్లు తగ్గాయా!

By:  Tupaki Desk   |   14 Oct 2019 11:02 AM GMT
సైరా: కలెక్షన్లే కాదు..బ్రేక్ ఈవెన్ ఫిగర్లు తగ్గాయా!
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న ప్రేక్షకులముందుకు వచ్చింది. ప్యాన్ ఇండియా ఫిలింగా తెలుగు కాకుండా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు రెండో రోజునుంచి కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది కానీ దసరా పండుగ సమయంలో కాస్త పుంజుకుంది. అయితే మళ్ళీ డ్రాప్స్ తప్పలేదు. తెలుగు వెర్షన్ పెర్ఫార్మన్స్ బెటర్ అయినప్పటికీ మిగతా అన్ని వెర్షన్లు డిజాస్టర్లుగా నిలిచాయి.

అయితే తెలుగు వెర్షన్ కలెక్షన్స్ లో కూడా ఇప్పుడు డ్రాప్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కలెక్షన్స్ దాదాపుగా ఫేక్ అని యాంటి ఫ్యాన్స్ వాదిస్తున్నారు. దీనికి ఫ్యాన్స్ కూడా అంతే దీటుగా సమాధానం ఇస్తున్నారు. యాంటి ఫ్యాన్స్ ఆరోపించే మరో విషయం ఏంటంటే 'సైరా' కలెక్షన్స్ ను ఒక దశ దాటి ఎక్కువగా చూపించలేక పోవడంతో ఏకంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్లను తగ్గిస్తున్నారట!

సినిమా విడుదల సమయంలో బడ్జెట్ మూడు వందల కోట్లని.. థియేట్రికల్ బిజినెస్ రూ.200 కోట్లకు పైమాటేనని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ మార్క్ నాలుగు కోట్లు అటూ ఇటుగా 150 కోట్ల షేర్ అంటున్నారు. అందులో 130 కోట్ల షేర్ వచ్చేసిందని ఇక జస్ట్ ఇరవై కోట్ల షేర్ తెస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు. ఈ లెక్కల మతలబును కాస్త బుర్ర ఉపయోగించి గమనించి చూస్తే అర్థం అవుతుందనేది వారి వాదన. జనాలు నమ్ముతారో లేదో తెలియదు కానీ బ్రేక్ ఈవెన్ ఫిగర్ నే తగ్గించడం మాత్రం మైండ్ బ్లోయింగ్ టెక్నిక్ అని వెటకారంగా మెచ్చుకుంటున్నారు. అయినా ఈ బాక్స్ ఆఫీసు లెక్కలు ఇంటర్ లో మూడు గ్రూప్స్ చదివిన మేథావులకు కానీ అర్థం అయ్యేలా లేవు!