Begin typing your search above and press return to search.
వాల్మీకి మీద సైరా ఎఫెక్ట్
By: Tupaki Desk | 16 Sep 2019 9:37 AM GMTఅదేంటి వాల్మీకి తర్వాత వచ్చే సైరా వల్ల ఎఫెక్ట్ ఏంటా అని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ వేరే ఉంది. సెప్టెంబర్ 20న విడుదల కానున్న వాల్మీకి మీద మెగా ఫ్యాన్స్ కు ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కేవలం 12 రోజుల గ్యాప్ తో రాబోతున్న తమ మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి మీదే వాళ్ళ దృష్టి ఎక్కువగా ఉంది. దానికి తోడు 18న ట్రైలర్ వచ్చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి అంచనాలు ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయమనే టాక్ ఇప్పటికే ఉంది.
ఈ లెక్కన వాల్మీకిని ఎంజాయ్ చేయాలన్న మూడ్ కన్నా సైరాను ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఉత్సుకతే డామినేట్ చేస్తుంది. అదే కనక జరిగితే వాల్మీకిలో ఎంత మాస్ కంటెంట్ తో ఉన్నా మెగాభిమానుల నుంచి రిపీట్ వ్యూస్ ని రాబట్టలేకపోవచ్చు. ఒకవేళ ఈ పరిస్థితి రాకూడదు అంటే వాల్మీకిలో ఎక్స్ ట్రాడినరి అనే కంటెంట్ ఉండాలి. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అనే టాక్ రావాలి.
అసలే వరుణ్ తేజ్ సాఫ్ట్ ఇమేజ్ కి ఊరమాస్ పాత్ర ఎంతవరకు నప్పుతుందో అనే అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. సైరా మూడ్ ఆల్రెడీ మొదలైపోయింది. వాల్మీకి రిలీజ్ డే రోజుకు ట్రైలర్ హడావిడి స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాని గురించిన చర్చలే అభిమానుల మధ్య ఎక్కువగా ఉంటాయి. వాటిని సర్ పాస్ చేయాలి అంటే వాల్మీకికి అదో ఛాలెంజే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన వాల్మీకిలో పూజ హెగ్డే హీరోయిన్ కాగా తమిళ నటుడు అధర్వ మరో కీలక పాత్ర చేస్తున్నాడు