Begin typing your search above and press return to search.

టాప్‌ 5లో నిలువలేక పోయిన 'సైరా'

By:  Tupaki Desk   |   2 Oct 2019 12:52 PM GMT
టాప్‌ 5లో నిలువలేక పోయిన సైరా
X
చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌ తో రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నిర్మించాడు. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌ అంటూ ప్రచారం చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. యూఎస్‌ లో ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ ను దక్కించుకోవడం కన్ఫర్మ్‌ అంటూ మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకం వ్యక్తం చేశారు. అయితే యూఎస్‌ ప్రీమియర్స్‌ విషయంలో సైరాకు నిరాశే మిగిలింది.

యావరేజ్‌ గా నిలిచిన 'సాహో' చిత్రం స్థాయిలో కూడా 'సైరా' యూఎస్‌ ప్రీమియర్‌ కలెక్షన్స్‌ ను రాబట్టలేక పోయింది. సినిమాకు వచ్చిన బజ్‌ నేపథ్యంలో బాహుబలి తర్వాత స్థానం లేదంటే కనీసం టాప్‌ 5లో అయినా ఉంటుందని భావించారు. కాని సైరా చిత్రం 8.57 లక్షల డాలర్లను మాత్రమే వసూళ్లు చేయగలిగింది. బాహుబలి 2 చిత్రం ప్రీమియర్‌ షోల ద్వారా 2.5 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయగా.. అజ్ఞాతవాసి చిత్రం 1.52 మిలియన్‌ డాలర్లను రాబట్టి రెండవ స్థానంలో ఉంది. బాహుబలి చిత్రం 1.52 మిలియన్‌ డాలర్లను రాబట్టి మూడవ స్థానంలో ఉంది.

ఖైదీ నెం.150 చిత్రం 1.29 మిలియన్‌ డాలర్లతో నాల్గవ స్థానంలో ఉంది. ఇక అయిదవ స్థానంలో స్పైడర్‌ 1 మిలియన్‌ డాలర్లతో ఉండగా ఆరవ స్థానంలో సాహో చిత్రం 9.15 లక్షల డాలర్లను రాబట్టింది. సాహో తర్వాత స్థానంలో సైరా నిలిచింది. టాప్‌ 7వ స్థానంలో ఉన్న సైరా చిత్రం 8.57 లక్షల డాలర్లను రాబట్టింది.

ప్రీమియర్‌ ల ద్వారా మిలియన్‌ డాలర్లను రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కాలేదు. వీకెండ్‌ అవ్వక పోవడంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల ఈ సినిమా ప్రీమియర్‌ షో కలెక్షన్స్‌ విషయంలో టాప్‌ నిలవలేదు. ఇక లాంగ్‌ రన్‌ లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి.