Begin typing your search above and press return to search.

US: సైరాకు 1 మిలియన్ లాస్?

By:  Tupaki Desk   |   9 Oct 2019 6:47 AM GMT
US: సైరాకు 1 మిలియన్ లాస్?
X
టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ఓ కల్పతరువు అని కొన్ని రోజుల క్రితం వరకూ అనుకునేవారు. ఇక యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా స్టార్ హీరోల సినిమాల హక్కులను పోటీపడి సొంతం చేసుకునేవారు. కానీ ఈమధ్యకాలంలో అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు టాలీవుడ్ సినిమాలు నిద్రలేని రాత్రులను మిగిలిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు నిజంగా లాభాలు తీసుకొచ్చిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. 95% పైగా సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిలిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'సైరా' చిత్రం కూడా అదే లిస్టులో చేరేలా ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

'సైరా' ను 3.3 మిలియన్ డాలర్లకు అమ్మితే ఇప్పటివరకూ వసూలయింది 2.2 మిలియన్ మాత్రమే. లాభాల సంగతి పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు మరో 1.1 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ను బట్టి చూస్తే అది అసాధ్యమేనంటున్నారు. ఇప్పటికే వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తయింది కాబట్టి కలెక్షన్స్ మెరుగయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని ట్రేడ్ వర్గాల వారి అభిప్రాయం. డైలీ కలెక్షన్స్ కూడా చాలా తక్కువస్థాయిలో ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు యూఎస్ లో దాదాపు 1 మిలియన్ డాలర్ల నష్టం తప్పేలా లేదని అంచనా.

ఒక సినిమాకు మిక్స్డ్ టాక్ తో నెగెటివ్ రివ్యూస్ తో తక్కువ కలెక్షన్స్ వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు కానీ మంచి టాక్.. రివ్యూస్ వచ్చిన సినిమాకు పరిస్థితి ఇలా ఉండడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ సినిమా యూఎస్ కలెక్షన్స్ సంక్రాంతి సినిమాల బిజినెస్ పై ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు.