Begin typing your search above and press return to search.

సైరా: అసలు బడ్జెట్ ఎంతబ్బా..?

By:  Tupaki Desk   |   10 Sep 2019 3:30 AM GMT
సైరా: అసలు బడ్జెట్ ఎంతబ్బా..?
X
భారీ బడ్జెట్ చిత్రాలలో ఈమధ్య కనిపిస్తున్న ఒక కామన్ అంశం ఏంటంటే ఫైనల్ బడ్జెట్ నిజంగా ఎంతైందో ఎవరూ సరిగా చెప్పకపోవడం. ఇప్పటివరకూ 'బాహుబలి'.. '2.0'.. 'సాహో' విషయంలో ఇలానే జరిగింది. బడ్జెట్ ఫిగర్ మొదట ఒకటి చెప్తారు.. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది అది పెరిగి పెరిగి పెరిగి ఆకాశమంత అవుతుంది. పోనీ అందరూ ఒకే మాట మీద ఉండి ఇంత అని ఒకటే నంబర్ చెప్తారా అనుకుంటే ఫిలింమేకర్లే నాలుగు సందర్భాలలో నాలుగు రకాల ఫిగర్లు చెప్తారు. తాజాగా 'సైరా' విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టుగా ఉంది.

'సైరా' బడ్జెట్ మొదట్లో రూ. 150 కోట్లు అన్నారు. అయితే చరణ్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నాడని.. చిరంజీవికి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది కాబట్టి డబ్బు ఖర్చుకు వెనకాడకుండా సురేందర్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడని.. బడ్జెట్ రూ. 200 కోట్లు దాటిందని అన్నారు. తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమా బడ్జెట్ రూ. 250 కోట్లు అని కూడా అన్నారు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డితో 'సైరా' బడ్జెట్ రూ.300 కోట్లు కదా అని ఇంటర్వ్యూయర్ అడిగితే సురేందర్ రెడ్డి దానిని ఖండించలేదు. పైగా 'బాహుబలి' నిర్మాతల తర్వాత ఇలా క్వాలిటీ కోసం రాజీ పడకుండా సినిమా కోసం ఖర్చు పెట్టిన నిర్మాత చరణ్ మాత్రమేనని ప్రశంసలు కురిపించడంతో పరోక్షంగా ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్లు అనే విషయం అంగీకరించినట్టయింది.

అయితే ఇప్పటివరకూ 'సైరా' బడ్జెట్ కరెక్ట్ గా ఎంత అయిందనే విషయం అటు చిరు చరణ్ లు కానీ ఇటు సురేందర్ రెడ్డి కానీ వెల్లడించలేదు. దీంతో 'సైరా' బడ్జెట్ విషయంలో జోరుగా స్పెక్యులేషన్లు కొనసాగుతున్నాయి. ఇంతకీ 'సైరా' రియల్ బడ్జెట్ ఎంత? ఈ విషయంపై ప్రమోషన్స్ సమయంలో కానీ మనకు కొద్దో గొప్పో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.