Begin typing your search above and press return to search.
'సైరా' క్లైమాక్స్ ను మార్చనున్నారా?
By: Tupaki Desk | 3 Sep 2018 10:04 AM GMTమెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. తెలుగులో ‘బాహుబలి’ తర్వాత ఈమద్య కాలంలో అంతటి గుర్తింపు - క్రేజ్ ను దక్కించుకున్న చిత్రం సైరా అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాల నడుమ - భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం కథను పరుచూరి బ్రదర్స్ పది సంవత్సరాల క్రితమే తయారు చేసుకున్నారు. పరుచూరి వారిపై ఉన్న నమ్మకంతో చిరంజీవి ఈ సినిమాకు కమిట్ అవ్వడం జరిగింది.
ముందుగా అనుకున్న కథ ప్రకారం నరసింహారెడ్డిని బ్రిటీష్ వారు ఉరి తీయడంతో సినిమా పూర్తి అవుతుందట. తెలుగులో యాంటీ క్లైమాక్స్ చిత్రాలు చాలా ఫ్లాప్ అయిన సందర్బాలు ఉన్నాయి. అందుకే క్లైమాక్స్ విషయంలో స్క్రిప్ట్ ను మార్చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం అవ్వడంతో చిన్న కూడా ఛాన్స్ తీసుకోవద్దని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే క్లైమాక్స్ మార్చితే ఎలా ఉంటుందా అని చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ప్రీ క్లైమాక్స్ గా నరసింహారెడ్డి మరణంను చూపించి - క్లైమాక్స్ గా స్వాతంత్రోద్యమంలో పోరాడిన ఇతర స్వాతంత్య్ర సమరయోధుల గురించి చూపిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన చిత్ర యూనిట్ సభ్యుల్లో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. క్లైమాక్స్ విషయంలో ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు మరియు మెగా కుటుంబ సన్నిహితులు కూడా తీవ్రంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే క్లైమాక్స్ విషయంలో ఒక నిర్ణయంకు వచ్చే అవకాశం ఉంది. సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీకి మొత్తం ఇది ఒక ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.