Begin typing your search above and press return to search.

అక్కడ ‘సైరా’ బలం - బలగం ఇదేనా?

By:  Tupaki Desk   |   25 Sep 2019 7:10 AM GMT
అక్కడ ‘సైరా’ బలం - బలగం ఇదేనా?
X
ఉత్తరాది జనాలకు - దక్షిణాది జనాలకు చాలా తేడా ఉంది. ఉత్తరాదిన దేశభక్తి పాల్లు కాస్తా ఎక్కువ. ప్రధాని మోడీ గడిచిన ఐదేళ్లలో తక్కువ చేసినా పాకిస్తాన్ పై పోరాటంతో జాతీయవాదాన్ని వాడి ఉత్తరాది జనాలను మెప్పించి గెలిచారని విశ్లేషకులు అంటారు. అదే దక్షిణాదిన ఇలాంటి పప్పులు ఉడకవని.. ఇక్కడ అభివృద్ధి చూసే జనాలు ఓటేస్తారని చెబుతుంటారు..

అయితే ప్రజల మనస్తత్వం ఉత్తరాదికి - దక్షిణాదికి క్లియర్ కట్ గా తేడా ఉందని అర్థమవుతోంది. దేశభక్తి నిండుగా ఉండే ఉత్తర భారతంలో ఇప్పుడు తెలుగు సినిమా ‘సైరా’పై కూడా బోలెడు ఆశలు పెంచుకున్నారు సినిమా యూనిట్. కొన్ని ఏళ్లుగా ఉత్తర భారతంలో భారీ దక్షిణాది సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. బాహుబలి ఆ తర్వాత రోబో.. మొన్నటి సాహో వరకూ వసూళ్ల వర్షం కురిపించాయి. క్రిటిక్స్ అంతా సాహో ఫ్లాప్ అన్నా అక్కడి జనాలు మాత్రం చూశారు. కలెక్షన్లు వచ్చాయి..

అయితే ఎప్పుడో 90వ దశకంలో ‘ఆజ్ కా గుండారాజ్’ అని హిందీలో సినిమా విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందీ బాటపట్టారు. ‘సైరా’ను హిందీలో విడుదల చేస్తున్నారు. మరి చిరంజీవి లాంటి సీనియర్ హీరో సినిమాను హిందీ జనాలు ఆదరిస్తారా? లేదా అన్నది అక్కడి విశ్లేషకుల్లో అనుమానంగా ఉందట..

అయితే సైరా లో బాలీవుడ్ ఆరాధ్య హీరో అమితాబ్ బచ్చన్ ఉండడం బాగా కలిసివచ్చింది. ఆయన ఇమేజ్ తో ప్రేక్షకులను థియేటర్ కు రప్పింవచ్చు. ఇక బాహుబలి లాంటి భారీతనం, యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ‘సైరా’లో ఉండడం ఈ సినిమాను హిందీ జనాలకు దగ్గర చేస్తోంది. హిందీ సినిమాల్లో ఇంతటి భారీ సినిమాలు రాకపోవడం కూడా ప్రేక్షకుల ఆసక్తికి కారణంగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొన్నటి సాహో కూడా క్రిటిక్స్ కు నచ్చకపోయినా అందులోని ఫుల్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్స్ కు ఉత్తరాదిన ప్రేక్షకులను ఆకర్షఇంచి బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు సైరా ప్రధానంగా దేశభక్తి చిత్రంకావడం.. పైగా అక్టోబర్ 2నే విడుదల కావడం.. ఉత్తరాదిన పెరిగిన జాతీయ భావం దృష్ట్యా సినిమా హిందీలో కూడా బాగానే ఆడుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి..చూడాలి మరి అక్టోబర్ 2 తర్వాత ‘సైరా’కు ఎలాంటి ఫలితం వస్తుందో..