Begin typing your search above and press return to search.
‘టైటానిక్’ తరహాలో సైరా..!
By: Tupaki Desk | 15 Dec 2018 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ శరవేగం గా జరుగుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వాటర్ లో యుద్ద సన్నివేశాల కోసం హాలీవుడ్ నుండి ఫైట్ మాస్టర్స్ ను పిలిపించారట. తెలుగులోనే కాకుండా హిందీ- తమిళ- మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్ లో తెగ చక్కర్లు కొడుతోందట.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఆయన గురించి ఒక ముసలావిడ తన మనవళ్ల కు కథగా చెబుతుండగా సినిమా స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘టైటానిక్’ ఇదే తరహాలో ప్రారంభం అవుతుంది. టైటానిక్ షిప్ గురించి వెదుకుతున్న కొందరు అందులో ప్రయాణించిన రోస్ వద్దకు వెళ్తారు. ఆమె అత్యంత హృదయ విధారక కథను చెబుతుంది. ఇప్పుడు అచ్చు అలాగే సైరా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించే కొందరికి ఒక బామ్మ ఆయన కథ చెప్పే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
నేరుగా ఉయ్యాలవాడ టైంకు వెళ్లకుండా మొదటి అయిదు లేదా పది నిమిషాల పాటు ఆయన గురించిన ఆసక్తికర విషయాలను చెప్పడం లేదంటే అందుకు సంబంధించి ఏదైనా చిన్న స్టోరీని అల్లడం చేస్తున్నారట. మహానటి చిత్రం లో కూడా డైరెక్ట్ గా సావిత్రి గురించి మొత్తం చూపించకుండా విజయ్ దేవరకొండ- సమంతలతో కాస్త సైడ్ ట్రాక్ నడపటం జరిగింది. అలా చేయడం వల్ల కమర్షియల్ మూవీ అన్న ఫీల్ కలిగింది. అందుకే సైరా కు కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.