Begin typing your search above and press return to search.

సైరా ఎన్ని కోట్లు తేవాలి?

By:  Tupaki Desk   |   10 Jun 2019 4:14 AM GMT
సైరా ఎన్ని కోట్లు తేవాలి?
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి షూటింగ్ ఫైనల్ స్టేజికి వచ్చేసింది . కొంత బాలన్స్ ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. అక్టోబర్ 2 రిలీజ్ డేట్ ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ట్రేడ్ కు ఇప్పటికే ఆ మేరకు సమాచారం వెళ్లినట్టుగా తెలిసింది. ఇకపోతే బిజినెస్ పరంగా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉన్న సైరాకు నిర్మాత రామ్ చరణ్ థియేట్రికల్ హక్కుల నుంచే సుమారు 100 కోట్లకు పైగా ఆశిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఇది కొంచెం రిస్క్ అనిపించే మొత్తమే అయినప్పటికీ అవుట్ ఫుట్ చూశాక ఖచ్చితంగా ఇది ఆ రేంజ్ మూవీ అవుతుందనే నమ్మకంతోనే వర్క్ అవుట్ అవుతుందన్న భరోసా ఇస్తున్నాడట. ఇప్పటికైతే తెలుగు రాష్ట్రాల బయ్యర్లు కోట్ చేసిన మొత్తం 75 కోట్ల దగ్గర ఉందని తెలిసింది. కానీ చరణ్ మాత్రం దానికి ససేమిరా అంటున్నాడట. దానికి కారణాలు ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150 రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయినప్పటికీ అంచనాల కంటే అనుమానాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనూ వంద కోట్లు ఈజీగా రాబట్టింది.

సైరా సంగతి వేరు. మల్టీ స్టారర్. అందులో 200 కోట్ల బడ్జెట్. కళ్ళు చెదిరే పోరాటాలు విజువల్ ఎఫెక్ట్స్ అన్నింటిని మించి చిరు ఇప్పటిదాకా చేయని జానర్. ఇప్పుడు పైకి కనిపించకపోయినా ప్రమోషన్ మొదలుపెట్టే నాటికి హైప్ తారాస్థాయికి చేరుతుంది. ఓపెనింగ్స్ పరంగా బాహుబలిని ఛాలెంజ్ చేసేది ఒక్క సైరా మాత్రమేనని మెగా ఫాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అవి నిలవాలి అంటే క్రేజ్ ని ఎక్కడికో తీసుకెళ్లాలి. ఇంకొద్ది రోజుల్లో సాహు ఫీవర్ మొదలవుతుంది కాబట్టి అది విడుదలయ్యాకే ప్రమోషన్ మొదలుపెట్టే ఆలోచనలో సైరా టీమ్ పక్కా ప్లానింగ్ తో ఉందట. మరి సైరా బిజినెస్ రేంజ్ ఎంత దాకా వెళ్తుందో ఇంకొద్ది రోజులు ఆగాక క్లారిటీ వస్తుంది