Begin typing your search above and press return to search.

సైరా సెన్సార్ కు రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   22 Sept 2019 1:34 PM IST
సైరా సెన్సార్ కు రంగం సిద్ధం
X
ఇవాళ అంగరంగ వైభవంగా జరగబోతున్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాద్ ఎల్బి స్టేడియం సిద్ధమయ్యింది. చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోవాలనే టార్గెట్ తో రూపొందిన మూవీ కాబట్టి దానికి తగ్గట్టే ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. విడుదలకు ఇంకో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఒకపక్క నరసింహారెడ్డి కుటుంబీకులు తమకు సొమ్ము అందాలని వివాదాలు చేస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా సెన్సార్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఫైనల్ కాపీకి కరెక్షన్స్ టచ్ అప్స్ నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసింది.

రేపు అంటే సోమవారం సెన్సార్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. చివరి నిమిషంలో ఏదైనా జాప్యం జరిగి లేట్ అయితే మంగళవారం అయితే పక్కాగా పూర్తి చేస్తారు. అదే రోజు సైరా ఎంత నిడివి ఉంది ఎన్ని కట్స్ ఇచ్చారు లాంటి వివరాలు బయటికి వస్తాయి. మహా అయితే ఇంకో రెండు రోజులు అంతే . ఓవర్సీస్ లోనూ భారీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో సెన్సార్ ఈ మాత్రం త్వరగా పూర్తి చేయకపోతే చివరి నిమిషంలో అప్ లోడింగ్ సమస్యలు వచ్చి లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి.

అందుకే కొణిదెల టీమ్ అలాంటి వాటికి అవకాశం లేకుండా గత రెండు వారాలుగా డే అండ్ నైట్ పోస్ట్ ప్రొడక్షన్ మీద పూర్తి ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. థియేటర్లు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయాయి. ఇంకో నాలుగైదు రోజుల్లో వాటి తాలూకు ప్రకటనలు కూడా వచ్చేస్తాయి. అభిమానుల్లో సెన్సార్ రిపోర్ట్ గురించిన ఉత్సుకత కూడా చాలా ఉంది. ముఖ్యంగా డ్యూరేషన్ మీద అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నింటికీ ఇంకో ఒకటి లేదా రెండు రోజుల్లో చెక్ పడిపోతుంది