Begin typing your search above and press return to search.
సైరాకు అప్పుడే కత్తెర్లా?
By: Tupaki Desk | 10 April 2019 4:30 PM GMTఇంకా షూటింగ్ మొదలుకాకుండానే అప్పుడే కత్తెర్లు ట్రిమ్మింగ్లు ఏంటనే అనుమానం రావొచ్చు. పాయింట్ వేరే ఉంది. ఇప్పటికే విడుదల విషయంలో జాప్యం ఎక్కువైపోతున్న సైరా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. షూటింగ్ ఎప్పుడు అయిపోతుందనే ఖచ్చితమైన అంచనా టీంకు సైతం లేదని రిపోర్ట్స్ ఉన్నాయి. దీనికి కారణాలు శోధించిన దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మాత రామ్ చరణ్ అసలు చిక్కు స్క్రిప్ట్ ఉందని గుర్తించారట.
మొదలుపెట్టక ముందు రెడీ చేసిన బౌండ్ స్క్రిప్ట్ ని యధాతధంగా తీస్తే నిడివి నాలుగు గంటల దాకా వస్తుందట. అందులో కొన్ని అవసరం లేని సన్నివేశాలు ఉండటంతో పాటు వాటికీ నిర్మాణం ప్లస్ సిజి ఎఫెక్ట్స్ కోసం భారీ బడ్జెట్ డిమాండ్ ఉండటంతో వాటిని తొలగించేలా సూరి చరణ్ లు నిర్ణయించుకున్నట్టు వినికిడి
అసలు కథలో ఫ్లో దెబ్బ తినకుండా ఎక్కడైతే ఉప కథలు లెంత్ ను పెంచుతున్నాయో వాటిని తీసే ఆలోచన విరమించుకున్నట్టు చెబుతున్నారు. వీలైనంత త్వరగా బాలన్స్ పార్ట్ ని ఫినిష్ చేసి ఫైనల్ కాపీ చిరు చరణ్ లు కలిసి చూసాక అప్పుడు ఓ డెసిషన్ కు వస్తారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు గంటలకు మించి సైరా రాకుండా ఎడిటర్ తో కూడా ముందస్తు చర్చలు జరిపినట్టు టాక్.
ఇంకా పాటల చిత్రీకరణ జరగాలి. అమిత్ త్రివేది ఇచ్చిన 5 ట్యూన్ల రికార్డింగ్ అయిపోయింది. షూటింగే ఆలస్యం. వివిధ బాషల మల్టీ స్టార్లు ఉండటం కూడా ఒక కారణమని చెప్పొచ్చు. మెగా ఫ్యాన్స్ రెండేళ్ళ నిరీక్షణకు సైరా ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి