Begin typing your search above and press return to search.

సైరా.. ఒక షాప్ పెట్టేశారంతే

By:  Tupaki Desk   |   5 Feb 2018 6:41 AM GMT
సైరా.. ఒక షాప్ పెట్టేశారంతే
X
మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సైరా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరిలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో చిత్ర యూనిట్ పై ఒత్తిడి చాలానే ఉంటుంది. అందులోను ఉయ్యాలా వాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది కావున ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డి టెక్నీషియన్స్ తో ప్రతి రోజు చర్చలు జరుపుతున్నాడు.

1940 లలో జరిగిన కదా కావున ఆ కాలం నాటి వాతావరణం తెరపై కనిపించేలా సరికొత్త సెట్స్ ను అలాగే కొన్ని వస్తువులను స్పెషల్ గా రెడీ చేస్తున్నారు. అయితే సినిమాలో అతి ముఖ్యమైన కాస్ట్యూమ్స్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెరపై లొకేషన్స్ ఎంత ముఖ్యమో పాత్ర తెరపై వెలిగిపోవాలంటే కాస్ట్యూమ్ ప్రాముఖ్యత ఉండే తీరాలి. చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఆ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఒక వస్త్రాల తయారీ కంపెనీతో ఒప్పందం కూర్చుకుని డిజైన్స్ ఇచ్చారట.

ఇక కాస్ట్యూమ్స్ మొత్తాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచడానికి అక్కడ ఎకరం స్థలంలో కాస్ట్యూమ్ షాప్ ను ఏర్పాటు చేశారు. పద్మావత్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన చంద్రకాత్ సొనావేన్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె కూడా ఆ వర్క్ లో బాగా కానుంది. ఇక వర్క్ షాప్ లో రోజు షెడ్యూల్ ప్రకారం డ్రెస్సింగ్ లను సెట్ చేస్తారట. మరి ఇంత కష్టపడుతున్నారంటే సినిమాలో ఆ వర్క్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.