Begin typing your search above and press return to search.
గూస్ బంప్స్ ఇస్తున్న ‘సైరా’ పిక్
By: Tupaki Desk | 28 July 2018 5:15 AM GMTమెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. దీని విశేషాల కోసం మెగా అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొన్ని నెలల కిందట ఈ చిత్రం నుంచి రెండు ఆన్ లొకేషన్ ఫొటోలు షేర్ చేసి అభిమానుల్ని మురిపించాడు అమితాబ్ బచ్చన్. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ లేదు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది ఒక వార్ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రం లాగా అనిపిస్తోంది.
భారీగా ఉన్న ఒక కోట ద్వారం సెట్టింగ్ ముందు భాగంలో తీసిన సన్నివేశానికి సంబంధించిన ఫొటో లాగా ఉందది. చివరగా చేసిన షెడ్యూల్లో ‘సైరా’ టీం భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్లు తీసిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ సైన్యం మీదికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన బృందంతో దాడి చేసే ఉదంతానికి సంబంధించిన భారీ ఎపిసోడ్లు చిత్రీకరించారు. సినిమాకు ఇదే కీలకం అంటున్నారు. ఇందుకోసం రాత్రి పూటే వరుసగా షూటింగ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోనే లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్న హాలీవుడ్ బృందానికి చెందిన వ్యక్తి ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు. మొత్తం ఇందులోని అట్మాస్ఫియర్ చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. దీన్ని బట్టి సంబంధిత దృశ్యాన్ని ఊహించుకుంటున్నారు. ఇటీవలి షెడ్యూల్ తో షూటింగ్ 30 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. కీలకమైన ఎపిసోడ్ పూర్తి చేయడంతో ఇక వేగం పెంచాలని చిత్ర బృందం భావిస్తోంది.