Begin typing your search above and press return to search.

ఇద్దరు మెగాస్టార్లు కలిసే టైం వచ్చింది

By:  Tupaki Desk   |   22 Feb 2018 12:07 AM GMT
ఇద్దరు మెగాస్టార్లు కలిసే టైం వచ్చింది
X
సైరా రెండో షెడ్యూల్ కోసం రంగం సిద్ధమవుతోంది. దీని కోసం తన లుక్ ని పలుమార్లు మేకోవర్ చేసుకున్న చిరంజీవి తీవ్రంగా కష్టపడుతున్న విషయం ఆయనను చూస్తేనే అర్థమైపోతోంది. కాల్ షీట్స్ సమస్య వల్ల అనుకున్న టైంకన్నా కొంత ఆలస్యంగా జరుగుతున్న షూటింగ్ ఇకపై బ్రేకులు లేకుండా చూసుకునేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని రకాలుగా సిద్ధపడుతున్నాడు. నయనతార ఎంట్రీ కూడా ఈ షెడ్యూల్ లోనే ఉంటుందని తెలిసింది. విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబు ఎంట్రీ గురించి ఇంకా అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఇక అందరి కన్నా ఎక్కువ ఆకర్షిస్తోంది మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. అసలు ఆయన నటిస్తారా లేదా అనే దాని గురించి పలు రకాల అనుమానాలు ఆ మధ్య కొన్ని మీడియా ఛానల్స్ వ్యక్తం చేసాయి. వాటికి చెక్ పెడుతూ ఇటీవలే సూరి అమితాబ్ ను కలిసిన ఫోటో షేర్ చేయటం చూసాం.

ఇక అమితాబ్ బచ్చన్ షూటింగ్ కు సిద్ధ పడుతున్నా వ్యక్తిగతంగా ఆయనకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నట్టు తెలిసింది. హిందిలో చేస్తున్న భారీ మల్టీ స్టారర్ 'ధగ్స్ అఫ్ హిందూస్తాన్' కోసం రకరకాల ఉష్ణోగ్రతల మధ్య షూటింగ్ లో పాల్గొన్న బిగ్ బి దాని వల్ల కొంత ఇబ్బంది పడినట్టు బాలీవుడ్ మీడియా కథనం. దాంతో స్వతహాగా ఎండలు భారీగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ హైదరాబాద్ లో షూటింగ్ అంటే సమస్య అవుతుందేమో అని ఆలోచించినట్టు టాక్. కాని సూరి మాత్రం సైరాలో అమితాబ్ కు సంబంధించిన పార్ట్ మొత్తం పూర్తి ఎయిర్ కండీషన్ చేయబడిన ఇన్ డోర్ సెట్ లో మాత్రమే తీస్తామని చెప్పి ఆ మేరకు ఒప్పించినట్టు తెలిసింది.

అమితాబ్ బచ్చన్ సైతం ఇది విన్నాకే ఓకే చెప్పినట్టు వార్త. తమ వయసుకు మించి కష్టపడుతున్న ఇద్దరు మెగాస్టార్ల కలయిక కోసం అభిమానులతో పాటు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబోలో సినిమా తీయాలని పలుమార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ మూడు దశాబ్దాల తర్వాత అది నిజమయ్యే సమయం వచ్చింది. సంక్రాంతికి సైరా విడుదల టార్గెట్ చేసారు. అనుకున్న ప్రకారం అన్ని టైంకి పూర్తయిపోతే అదేమి పెద్ద కష్టం కాదు.