Begin typing your search above and press return to search.
సైరాకు చివరి నిమిషం హర్రీ
By: Tupaki Desk | 30 Sep 2019 5:45 AM GMTసైరా టీమ్ చివరి నిమిషంలో హర్రీగా ఉందా? అంటే అవుననే అర్థమవుతోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్రచారమైన సైరా చిత్రానికి ప్రమోషన్ ఓవైపు.. రిలీజ్ టెన్షన్స్ మరోవైపు ఇబ్బంది పెడుతున్నాయని తెలుస్తోంది.
ఓ వైపు విదేశీ రిలీజ్ ఎంతో సంక్లిష్టంగా జరుగుతోందట. దీని వల్ల కొన్నిచోట్ల ప్రీమియర్లకు సమస్య తలెత్తిందని మీడియాలో ప్రచారం అవుతోంది. ముఖ్యంగా అమెరికా రిలీజ్ సాఫీగా సాగడం లేదు. అక్కడ క్యూబ్ లు చాలా చోట్లకు ఇప్పటికే చేరుకున్నా కొన్నిచోట్లకు చేరాల్సి ఉంది. క్యూబ్ డిస్కులు చేరకపోవడం వల్ల కొన్ని చోట్ల ప్రీమియర్లు క్యాన్సిల్ చేస్తున్నారని తెలిసింది. ఇలాంటి చివరి నిమిషం టెన్సన్ లేకుండా ఉండాలంటే ఆదివారం రాక ముందే అక్కడకు క్యూబ్ కంటెంట్ చేరాల్సి ఉన్నా ఆ పని చేయడంలో కొణిదెల టీమ్ విఫలమైందని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. దీనివల్ల మంగళవారం పడాల్సిన 2గం.ల ప్రీమియర్లు వేస్తారా అన్నది సందేహమేనని అంటున్నారు. చాలా చోట్లకు క్యూబ్ చేరింది. అక్కడ ప్రీమియర్లకు ఆటంకం లేదు. కానీ కొన్నిచోట్లకు క్యూబ్ చేరలేదని చెబుతున్నారు.
చివరి నిమిషంలో హర్రీలో ఉన్న కొణిదెల బృందం.. ఓ వైపు మెట్రో నగరాల్లో ప్రచారం కోసం టెన్షగా సుడిగాలి పర్యటనలు చేస్తోంది. మరోవైపు దర్శకుడు సురేంద్ రెడ్డి చివరి నిమిషం వరకూ క్వాలిటీ కంటెంట్ కోసం శ్రమిస్తూ ప్రచారానికి దూరంగా ఉన్నారు. రామ్ చరణ్- చిరంజీవి బృందం ఆదివారం సాయంత్రం బెంగళూరులోని భారీ ఈవెంట్ కి అటెండయ్యారు.