Begin typing your search above and press return to search.
జార్జియాపై సైరా గ్యాంగ్ ఎటాక్
By: Tupaki Desk | 28 Aug 2018 6:26 AM GMTమెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా సైరా-నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఇదివరకూ రిలీజైన ఫస్ట్ లుక్ టీజర్ మెగాభిమానులు సహా ప్రపంచవ్యాప్తంగా జనాల్ని అలరించింది. ఇప్పటికే రెండు కోట్ల వ్యూస్ దిశగా వెళుతూ సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం రాఖీ సందర్భంగా చిరు గ్యాప్ తీసుకున్న అన్నయ్య తిరిగి సైరా పనుల్లో బిజీ అయిపోయారు. తదుపరి జార్జియాకు సైరా టీమ్ పయనమవుతోంది. అక్కడ ఎగ్జోటిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగనుంది. 50 మంది యూనిట్ సభ్యులు జార్జియా వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇదివరకూ ఇదే జార్జియా లొకేషన్లలో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి తెరకెక్కిన సంగతి తెలిసిందే. జార్జియా మల్ల యోధులతో భీకర పోరాట సన్నివేశాన్ని క్రిష్ చిత్రీకరించారు.
వార్ ఎపిక్ డ్రామాల్ని తెరకెక్కించడంలో జార్జియా టెక్నీషియన్ల పనితనం అప్పుడు చర్చకొచ్చింది. ప్రస్తుతం అదే సాంకేతిక నిపుణుల బృందం సైరా టీమ్ తో పని చేయనుందా? భారీ వార్ ఎపిసోడ్స్ లో అనుభవం గల ఆర్టిస్టులు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్లను హైర్ చేసుకుని యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సైరా టీమ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వార్ డ్రామా అంటే లక్షలాది మంది సైన్యం.. భీకర యుద్ధాలు.. కోటలు - రాజ్యాలు .. భారీ మైదానం .. ఇవన్నీ కనిపించాలి. వాటికి అనువైన లొకేషన్లు జార్జియాలో పుష్కలంగా ఉన్నాయి. సాంకేతికత - లొకేషన్లు ఒకేచోట అందుబాటులో ఉండడం సైరా టీమ్ కి కలిసొస్తుందనే ఇక్కడ ప్లాన్ చేశారని భావించవచ్చు. సైరా సై.. యుద్ధానికి సై!