Begin typing your search above and press return to search.

దాడికి దిగుతున్న నరసింహారెడ్డి

By:  Tupaki Desk   |   4 Jun 2018 4:26 AM GMT
దాడికి దిగుతున్న నరసింహారెడ్డి
X
మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. బ్రిటిష్ పాలకులపై పోరాడిన సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ కాస్టింగ్ తో.. టెక్నికల్ హంగులతో షూటింగ్ అవుతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి.. అంచనాలు ఉన్నాయి.

సైరా మూవీలో ఫైటింగ్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేశారు. ఇంతవరకు మామూలు సీన్ల షూటింగ్ చేస్తూ వచ్చిన ఈ మూవీ యూనిట్ ఇంక నుంచి ఫైట్ సీన్లను షూట్ చేయడానికి రెడీ అయింది. 45 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ఓన్లీ ఫైట్ సీన్ల కోసమే కేటాయించారు. ముఖ్యంగా నరసింహారెడ్డి అనుచరులతో బ్రిటిష్ పాలకులపై గన్నులు.. ఆయుధాలతో దాడికి దిగే సీన్లు ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతిపై ఈ షెడ్యూల్ లో షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అతడిపైనా కొన్ని మేజర్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

సినిమాలో హైలైట్ గా నిలిచే యాక్షన్ అన్నీ ఈ షెడ్యూల్ లోనే షూట్ చేస్తున్నారు. మొత్తం షూటింగులో గ్రాఫిక్స్ మినహా ఇవే కీలక సీన్లు కావడంతో యూనిట్ పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తోంది. హైదరాబాద్ లోని గోల్కొండ శివార్లలో షూటింగ్ సాగుతోందని తెలుస్తోంది. దీని తరవాత రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సెట్ వేసి మరికొన్నియాక్షన్ సన్నివేశాలు తీయనున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషర్లపై పోరాటం మొదలుపెట్టే సీన్లు ఇక్కడ తీయనున్నారు.