Begin typing your search above and press return to search.
ఆ పరిస్థితుల్లోనూ `సై అన్న `సైరా`టీమ్!
By: Tupaki Desk | 27 July 2018 11:38 AM GMTమెగా స్టార్ చిరంజీవి, విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డి ల కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `సైరా నరసింహా రెడ్డి`పై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు తమిళ నటుడు విజయ్ సేతుపతి - కిచ్చ సుదీప్. జగపతి బాబు - నయనతార - తమన్నావంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. బాహుబలి రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా, ఈ చిత్రంలో అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశం షెడ్యూల్ ముగిసింది.
ప్రతికూల పరిస్థితుల్లోనూ....కేవలం 35 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ ముగించారట. ఆ యాక్షన్ పార్ట్ గురించి చిత్ర కెమెరామెన్ రత్నవేలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ చూసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డిని చిరు ప్రశంసల్లో ముంచెత్తారని తెలుస్తోంది.
బ్రిటిష్ ఆయుధాగారంపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి....తన అనుచరలతో సహా దండెత్తే కీలకమైన సన్నివేశం కోసం హైదరాబాద్ శివారులో ఓ భారీ సెట్ ను నిర్మించారట. బ్రిటిష్ ఆర్మీ - ఫిరంగుల - గుర్రాల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించామని రత్నవేలు తెలిపారు. అయితే, వర్షంతో పాటు వెలుతురులేమి ఆ షూటింగ్ కు ఆటంకం కలిగించాయని....అయినప్పటికీ విజయవంతంగా షూటింగ్ ముగించామని అన్నారు.
కీలకమైన ఈ యుద్ధ సన్నివేశాల్ని 35 రాత్రుల్లో తెరకెక్కించామన్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ చూసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డిని చిరు ప్రశంసల్లో ముంచెత్తారట. దాంతోపాటు, ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ను వెల్లడించేందుకు చిరు స్నేహితుడు తిరుపతి ప్రసాద్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. తిరుపతి ప్రసాద్ ను నిర్మాత రామ్ చరణ్ ఏర్పాటు చేశారట.