Begin typing your search above and press return to search.
ఆ కత్తిలోని ఉగ్రనరసింహాన్ని చూడు!
By: Tupaki Desk | 20 Aug 2018 4:39 AM GMTసైరా నరసింహారెడ్డి.. ప్రస్తుతం ఇంటా బయటా మార్మోగిపోతున్న పేరు ఇది. టైటిల్ లోనే ఉగ్రనరసింహం కనిపిస్తోంది. అసలే పౌరుషాల రాయలసీమ గడ్డపై జన్మించిన వీరాధివీరుడి కథతో సినిమా తీస్తున్నారు. కత్తి ఎత్తితే కుత్తుక తెగాల్సిందే. ఇదిగో అందుకు సింబాలిక్‌గానే ఈ కత్తిని మీడియాకి ప్రదర్శించారిలా. ఆ కత్తిని ఏమని వర్ణించాలి?
అసలే ఉగ్ర నరసింహుని కత్తి అది. అన్యాయాన్ని చూస్తూ ఊరుకునే రకం కాదు. సైరా అంటూ కత్తి ఎత్తితే తలలు ఎగిరి పడాలి. ఆ తలలు లెక్క పెట్టుకోవడానికి అకౌంటెంట్ ని అపాయింట్ చేసుకోవాలి. ఆ కోట గుమ్మం ముందు.. కనుచూపు మేరా తెగిపడిన తలలే దర్శనమిస్తాయి. అంతటి భీకర యుద్ధంలో పాల్గొన్న కత్తి అది. మొనతేలిన శూరత్వం నింపిన ప్రత్యేక ఖడ్గం అది. నాటి రోజుల్లో రాజుల ధీరత్వానికి సింబాలిక్‌గా డిజైన్ చేసిన ప్రత్యేక ఖడ్గమిది. ఇలాంటి ఖడ్గాన్ని ధరించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథనరంగంలోకి దూకితే ఎలా ఉంటుందో చూసి తీరాలన్న కసి అంతకంతకు మెగాభిమానుల్లో పెరుగుతూనే ఉంది.
ఆగస్టు 21న 11.30 ఏఎం `సైరా` టీజర్ రాబోతోంది. ఈ టీజర్ కి సర్వ సన్నాహాల్లో ఉంది కొణిదెల కాంపౌండ్. ఇప్పటికే టీజర్ కటింగ్ సహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెడీ అయిపోయింది. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అన్ని పనులు పూర్తి చేశారు. ``నేను కూడా ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి చారిత్రక సినిమాలో భాగం అయినందుకు ఎంతో ఉత్కంఠగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిద్ధం. మీ ఫీడ్ బ్యాక్ కోసం వేచి చూస్తున్నా`` అని ట్వీట్ చేశాడు అమిత్ త్రివేది. దీనిని బట్టి యుద్ధం ఇక మొదలైనట్టేనని అర్థమవుతోంది. సైరా జర్నీ ఎప్పుడో మొదలుపెట్టేశారు. వార్ అహెడ్ .. బీ ప్రిపేర్డ్!!