Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : సీమబిడ్డ పౌరుషాగ్ని
By: Tupaki Desk | 18 Sep 2019 1:48 PM GMTమెగాస్టార్ అభిమానులు కోటి దీపాలు కళ్ళల్లో పెట్టుకుని ఎదురు చూసిన సైరా నరసింహారెడ్డి ట్రైలర్ లాంచ్ తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లతో పాటు ఆన్ లైన్ లో ఏకకాలంలో విడుదలయింది. ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ట్రైలర్ మీద ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక కంటెంట్ విషయానికి వస్తే సీమ బిడ్డ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (చిరంజీవి)మడమ తిప్పని యోధుడు. గురువు( అమితాబ్ బచ్చన్)మార్గదర్శకత్వంలో తొలి స్వతంత్ర పోరాటానికి బీజం వేస్తాడు.
తనవాళ్లను బ్రిటిషర్లు ఎంతగా వేధించినా చలించక తిరుగుబాట బావుటా ఎగరెస్తాడు. ఈ ప్రయాణంలో తనను కోరుకున్న లక్ష్మి(తమన్నా) తన జీవిత భాగస్వామి అయిన భార్య(నయనతార) అండగా పోరాటం మొదలుపెడతాడు. దీనికి బాసటగా పక్క రాష్ట్రాల యోధులు(సుదీప్-విజయ్ సేతుపతి)కూడా తోడవుతారు. మరి ఉయ్యాలవాడ బిడ్డ ఈ పోరుని ఎలా ముగించాడు అనేది సినిమాలో చూడాలి
ట్రైలర్ ఒక్క మాటలో చెప్పాలంటే టెర్రిఫిక్ అనే మాట చిన్నది. ఆద్యంతం కళ్ళు చెదిరే విజువల్స్ తో అప్పటి వాతావరణాన్ని పునః సృష్టించిన తీరుకు ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్లకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. చిరంజీవి వీరుడి పాత్రలో ఒళ్ళు జలదరించే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నీకెందుకు కట్టాలిరా శిస్తు అని చెప్పే డైలాగ్ లో కోర్ట్ లో గెట్ అవే ఫ్రమ మై మదర్ లాండ్ అంటూ హుంకరించే సన్నివేశంలో విశ్వరూపం చూపించారు.
ముఖ్యంగా లీడ్ క్యాస్టింగ్ అంతా పాల్గొన్న యాక్షన్ సన్నివేశాలు మాములుగా లేవు.తెలుగు సినిమా స్థాయిని సైరా ఎన్ని మెట్లు ఎక్కిస్తుందో ఊహించుకోవడం కష్టమే. సురేందర్ రెడ్డి తన మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకున్నాడు. రత్నవేలు ఛాయాగ్రహణం నిజంగానే హాలీవుడ్ ని తలదన్నే స్థాయిలో ఉంది. గూస్ బంప్స్ తప్ప మరోమాటకు తావు లేకుండా అలరించిన సైరా ట్రైలర్ తో హైప్ మాటలకందని ఎత్తుకు వెళ్లిపోయింది. విడుదల తేదీ అక్టోబర్ 2 దాకా వేచి చూడటం భారంగా మారేలా ఉంది అభిమానులకు