Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల్లో సైరా 2 రోజుల కలెక్షన్స్
By: Tupaki Desk | 4 Oct 2019 4:10 PM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా నరసింహారెడ్డి` తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లోనే 30 కోట్ల వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో 10 కోట్ల వసూళ్లతో అక్కడా విజయ ఢాంకా మ్రోగించింది. తమిళనాడు లో మెగా ఛరిష్మా సరిపోని కారణంతో అక్కడ వసూళ్లు అంతంత మాత్రంగానే నిలిచాయి. ఇక బాలీవుడ్ లో వార్ సినిమా ప్రభావం `సైరా` పై పడింది. దీంతో అక్కడ వసూళ్లు ఆశించినంతగా లేవు. ఓవర్సీస్ లో మాత్రం కాస్త తడబడినా తొలి వీకెండ్ నాటికి సర్ధుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. గురువారం కొన్ని సెక్షన్లకు నాన్ హాలీడే కావడంతో అన్ని చోట్లా వసూళ్లపై ప్రభావం పడింది. ప్రస్తుతం సైరా సన్నివేశం చూస్తుంటే పూర్తిగా తెలుగు రాష్ట్రాల వసూళ్లపైనే డిపెండ్ అయ్యిందని అర్థమవుతోంది. తమిళనాడు-కేరళ లాంటి చోట హవా సాగని నేపథ్యంలో ఏపీ-నైజాం ఆదుకోవాల్సి ఉంటుంది. దాదాపు 200కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమాకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వసూళ్లు ఆదుకుంటాయనే అంతా ఆశిస్తున్నారు.
ఇంతకీ రెండో రోజు ఏపీ-నైజాం వసూళ్లు ఎంత? అన్నదానికి తాజాగా సమాచారం రివీలైంది. రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరో 10 కోట్లు రాబట్టింది సైరా. తెలుగు రాష్ట్రాల్లో సైరా రెండు రోజుల వసూళ్ల వివరాలు పరిశీలిస్తే.. నైజాం-12.8 కోట్లు.. సీడెడ్ 7.70 కోట్లు.. ఈస్ట్ 5.30 కోట్లు.. కృష్ణా-3.75 కోట్లు.. గుంటూరు-5.73 కోట్లు.. వెస్ట్- 4.36 కోట్లు.. నెల్లూరు-2.40 కోట్లు.. యు.ఏ లో 6.68 కోట్ల మేర వసూళ్లను సాధించింది. మొత్తంగా రెండు రోజుల వసూళ్లు 47.60 కోట్లు గా తేలింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది కాబట్టి ఇంకా భారీ మొత్తాల్ని వెనక్కి తేవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గురు-శుక్ర వారాలు ఎలా ఉన్నా.. శని- ఆదివారాల్లో `సైరా` వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది. శనివారం నుంచి చాలా ప్రయివేట్ సెక్టార్లలలో.. కోచింగ్ సెంటర్లలలో దసరా సెలవులు ప్రకటించారు. దాదాపు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రోజులు సైరాకు కీలకం కానున్నాయి. హిట్టు టాక్ నేపథ్యంలో ప్రేక్షకులంతా సైరా వైపే పరుగులు తీసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ట్రేడ్. దీంతో సైరా వసూళ్లు వచ్చే వారంతానికి భారీగా ఉండే అవకాశం ఉంది.