Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల్లో సైరా 5రోజుల కలెక్షన్స్
By: Tupaki Desk | 7 Oct 2019 9:59 AM GMTభారీ అంచనాల నడుమ రిలీజైన పాన్ ఇండియా చిత్రం `సైరా-నరసింహారెడ్డి` ఐదు రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉంది? అంటే .. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల నుంచి 72కోట్ల షేర్ వసూలైంది. అటు అమెరికాలో 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. దాదాపు 200కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇంకా చాలా పెద్ద మొత్తాల్ని వసూలు చేయాల్సి ఉంటుంది. అందుకు లాంగ్ రన్ లోనూ స్థిరంగా వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు రోజుల షేర్ వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
ఐదోరోజు ఏపీ - నైజాం వసూళ్లు పరిశీలిస్తే... వైజాగ్ -1.38 కోట్లు.. తూ.గో జిల్లా-55 లక్షలు.. ప.గో జిల్లా- 37లక్షలు.. కృష్ణ- 71లక్షలు.. గుంటూరు -73లక్షలు.. నెల్లూరు-30లక్షలు.. సీడెడ్-1.80కోట్లు.. నైజాం- 3.30కోట్లు వసూలు చేసింది.
ఐదు రోజుల్లో ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ నుంచి 72.15కోట్ల మేర షేర్ వసూలైంది. ఏరియాల వారీగా వసూళ్లను చూస్తే.. వైజాగ్ -9.98 కోట్లు .. తూ.గో జిల్లా-7.39 కోట్లు .. ప.గో జిల్లా- 5.26కోట్లు .. కృష్ణ- 5.39 కోట్లు.. గుంటూరు -7.38కోట్లు .. నెల్లూరు-3.19కోట్లు .. సీడెడ్-12.61కోట్లు .. నైజాం-20.95కోట్లు కలెక్టయ్యింది. ఈ దసరా సెలవులు పూర్తయినా వసూళ్ల దూకుడు కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే సైరా బ్రేక్ ఈవెన్ సాధించి సేఫ్ జోన్ కి చేరగలదు.
దాదాపు 200 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేశారు. రూ.270 కోట్ల మేర బడ్జెట్ వెచ్చించామని కొణిదెల కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అంత పెద్ద మొత్తం వసూలు చేయాలంటే ఇంకా చాలా దూరంలో ఉందని అర్థమవుతోంది. ఇరుగుపొరుగున ఆశించిన స్థాయి కలెక్షన్స్ లేవు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. హిందీ.. తమిళం.. కన్నడలోనూ డిజాస్టర్ రిజల్ట్ ని అందుకుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది.