Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'సైరా నరసింహారెడ్డి'
By: Tupaki Desk | 2 Oct 2019 7:38 AM GMTచిత్రం : 'సైరా నరసింహారెడ్డి'
నటీనటులు: చిరంజీవి - నయనతార - తమన్నా - అమితాబ్ బచ్చన్ - జగపతిబాబు - కిచ్చా సుదీప్ - విజయ్ సేతుపతి - రవికిషన్ - పృథ్వీ - రోహిణి - సాయిచంద్ - రఘుబాబు - రణధీర్ తదితరులు
సంగీతం: అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం: జులియస్ పకియం
ఛాయాగ్రహణం: రత్నవేలు
కథ: పరుచూరి బ్రదర్స్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: రామ్ చరణ్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సురేందర్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమర యోధుడు.. బ్రిటిష్ వాళ్లపై తొలి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా చిరంజీవి తనయుడు రామ్ చరణే నిర్మించాడు. భారీ అంచనాలతో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
బ్రిటిష్ వాళ్లు భారత దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో తెలుగు గడ్డ మీద పాలెగాళ్ల వ్యవస్థ నడుస్తుంటుంది. రాయలసీమలోని రేనాటి ప్రాంతానికి మజ్జారి నరసింహారెడ్డి (చిరంజీవి) పాలెగాడు. బ్రిటిష్ వాళ్ల అరాచకాలు అంతకంతకూ పెరిగి.. కరువు విలయతాండవం చేస్తున్న సమయంలోనూ బలవంతంగా శిస్తు వసూలు చేస్తున్న సంగతి తెలిసి నరసిహారెడ్డి వారికి ఎదురు తిరుగుతాడు. పన్నుల కోసం తన జనాల్ని వేధించి - కొందరి ప్రాణాలు కూడా తీసిన జాక్సన్ అనే ఇంగ్లిష్ దొరను నరసింహారెడ్డి మట్టుబెడతాడు. దీంతో బ్రిటిష్ పాలకులు ఆగ్రహించి.. నరసింహారెడ్డిని - అతడి సైన్యాన్ని ఎలాగైనా అంతం చేయాలని పంతం పడతారు. మరి వాళ్లను నరసింహారెడ్డి ఎలా ఢీకొట్టాడు.. చివరికి ఎలా వీర మరణం పొందాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూసే ముందు అందరూ చేయాల్సిన ఒక పని.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఏమీ తెలుసుకోకపోవడం. తెలుసుకున్నా సరే.. దాన్ని పూర్తిగా మరిచిపోవడం. ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కాదు.. ఒక కల్పిత గాథ అంటూ దర్శకుడు సురేందర్ రెడ్డి కోర్టుకు చెప్పిన మాటను బలంగా నమ్మి థియేటర్ లోకి అడుగు పెట్టాలి. ‘సైరా’ను నిజ జీవిత కథ అని నమ్మి సినిమా చూడటం మొదలుపెడితే.. అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. కొంతమందితో సైన్యాన్ని తయారు చేసుకుని తనకున్న పరిమితుల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారి మీద వీరోచితంగానే పోరాడాడని చరిత్ర చెబుతోంది. కానీ సినిమాలో మాత్రం అతను ఒక బాహుబలిలా మారి తన సైన్యంతో పదివేల మంది బ్రిటిష్ బలగాన్ని చంపేసినట్లుగా చూపించారు. ఇక ఒక బ్రిటిష్ అధికారిని వెంటాడి వెంటాడి నీటి మడుగులోకి వెళ్లి అతడి ప్రాణం తీసే తీరు అయితే మరీ విడ్డూరం. ఇక నరసింహారెడ్డి ఉరి తాడుకు వేలాడుతూ కూడా తన వీరత్వాన్ని చూపించినట్లుగా చిత్రీకరించిన సన్నివేశం అయితే అతిశయోక్తికి పరాకాష్ట అన్నట్లే. సినిమా అంతటా గూస్ బంప్స్ ఇచ్చే ఇలాంటి మూమెంట్స్ కు ఢోకా లేదు. కానీ ఇది వాస్తవ గాథ కాదు అనుకుంటేనే వాటిని ఆస్వాదించగలం.
ఎంత సినిమా అయినా.. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినా.. మరీ ఇంత ఎగ్జాజరేషన్ అంటే జీర్ణించుకోవడం కష్టమే. ఒక వాస్తవ గాథ సినిమాగా మారినపుడు ప్రేక్షకులు దాన్ని చూసే కోణం వేరు. ఒక కల్పిత కథను చూసేటపుడు వాళ్ల దృష్టికోణం వేరు. అయితే ముందు నుంచి వాస్తవ కథ అని ప్రచారం చేసి.. సినిమాలో మాత్రం అన్నీ అతిశయోక్తులే చూపించారు. మనకు తెలియని చరిత్ర అయితే.. ఎలాగోలా సరిపెట్టుకోవచ్చు. కానీ స్వాతంత్రోద్యమంలో కీలక మలుపుగా పేర్కొనే ఒక అధ్యాయం.. దేశభక్తితో ముడిపడ్డ కథాంశం అయినపుడు దానికి ఎమోషనల్ గా కనెక్ట్ కాావాలంటే చూస్తున్నది వాస్తవం అనిపించాలి. ‘సైరా’లో ఈ అతిశయోక్తుల కారణంగా.. వాస్తవంగా జరిగిన విషయాలు కూడా నిజం కాదు అనుకునే ప్రమాాదం కూడా తలెత్తింది. ‘బాహుబలి’ని ప్రేరణగా తీసుకుని ప్రతి సన్నివేశంలోనూ భారీతనం కోసం ప్రయత్నించడం వల్ల కూడా ‘సైరా’ పూర్తిగా ఒక కల్పిత కథను చూస్తున్న భావన కలిగిస్తుంది.
ఈ అభ్యంతరాల్ని పక్కన పెడితే.. ‘సైరా’ మూడు గంటల పాటు ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టడంలో చాలా వరకు విజయవంతం అయింది. ప్రథమార్ధంలో కొంత నత్త నడకను మినహాయిస్తే ‘సైరా’ ఎక్కడా ఆగకుండా పరుగులు పెడుతుంది. మైకం కమ్మి జనాల మీదికి దూసుకొస్తున్న వందల ఎడ్లను దారి మళ్లిస్తూ నరసింహారెడ్డి తన వీరత్వాన్ని చూపించే పరచయ సన్నివేశంతోనే మనం ఎలాంటి సినిమా చూడబోతున్నామో దర్శకుడు సురేందర్ రెడ్డి ముందే సంకేతాలు ఇచ్చేశాడు. ఆ తర్వాత నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ల మీద ఎదురుతిరగడానికి అవసరమైన ఉద్వేగం తెచ్చే దిశగా.. సెంటిమెంటు సన్నివేశాలు సాగుతాయి. ఇక్కడ కథ కొంచెం నెమ్మదిగా నడిచినా.. అది అవసరమే అనిపిస్తుంది. తన వాళ్లను చంపిన బ్రిటిష్ అధికారి తల నరుకుతానని ప్రతిజ్ఞ చేసి.. ఆ పనిని నరసింహారెడ్డి పూర్తి చేసే ఘట్టం చిరు అభిమానులకే కాదు ప్రతి ప్రేక్షకుడికీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఇక్కడ దర్శకుడు సురేందర్ రెడ్డిని రాజమౌళి పూనాడా అనిపించేలా ఆ సన్నివేశం ఉంటుంది. ‘సైరా’ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచే సన్నివేశం అది.
ఇక ద్వితీయార్ధంలో గూస్ మూమెంట్స్ కు లెక్కే లేదు. తన కోట మీదికి బ్రిటిష్ సైన్యం దాడిని సామాన్య ప్రజల అండతోనే నరసింహారెడ్డి తిప్పికొట్టే ఘట్టం.. తనకు ద్రోహం తలపెట్టిన ఇంటిదొంగలకు బుద్ధి చెప్పే సన్నివేశం.. బ్రిటిష్ సైన్యంతో వార్ ఎపిసోడ్ వేటికవే ప్రత్యేకంగా ఉండి కథను ముందుకు నడిపిస్తాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. బ్రిటిష్ వాళ్ల చేతికి నరసింహారెడ్డి చిక్కే ఎపిసోడ్ సినిమాలో అతి పెద్ద హైలైట్ గా చెప్పవచ్చు. ఇక్కడ భావోద్వేగాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విజయవంతం అయ్యాడు. దర్శకుడిగా అతడి అత్యుత్తమ ప్రతిభ ఇక్కడే కనిపిస్తుంది. వీరా రెడ్డి పాత్రకు ఇచ్చిన ట్విస్టు.. దాని ముగింపు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశం కూడా గొప్ప భావోద్వేగంతో సాగి హృదయాల్ని తాకుతుంది. అయితే ఇక్కడ కూడా మళ్లీ హీరోయిజం కోసం ప్రయత్నిస్తూ అతిశయోక్తి జోడించడం విడ్డూరంగా అనిపిస్తుంది కానీ.. అప్పటికే సినిమాలో ఇలాంటివి చాలా చూశాం కాబట్టి సర్దుకుపోతాం. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవిని ‘బాహుబలి’ తరహా సినిమాలో చూడాలనుకున్న వాళ్లకు.. అదే తరహా భారీతనాన్ని - వీరోచిత దృశ్యాల్ని కోరుకున్న వాళ్లకు ‘సైరా’ కనువిందు చేస్తుందనడంలోో సందేహం లేదు. అలా కాకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను వాస్తవిక కోణంలో తెరపై చూడాలనుకుంటే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు:
మెగాస్టార్ చిరంజీవిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చూడటం ఆయన అభిమానులకు మహదానందాన్ని కలిగించొచ్చు. తన వంతుగా ఈ పాత్రలో ఫిట్ కావడానికి ఆయన ఎంతో కష్టపడ్డ విషయం తెరమీద కనిపిస్తుంది. కానీ చిరు లుక్ అన్ని చోట్లా కన్విన్సింగ్ గా అనిపించదు. చిరు ఒక 20 ఏళ్ల ముందు ఈ పాత్ర చేస్తే అద్భుతంగా ఉండేదేమో. ఇప్పుడు వయసు ప్రభావం వల్ల కొన్ని చోట్ల ఆయన లుక్ - స్క్రీన్ ప్రెజెన్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. యుద్ధ సన్నివేశాల్లో ఆయన నమ్మశక్యంగా అనిపించరు. అయితే ఎమోషనల్ సన్నివేశాల్ని చిరు తన నటనతో రక్తి కట్టించిన తీరు ఆకట్టుకుంటుంది. చివరి 20 నిమిషాల్లో చిరు నటన మాటలకు అందని విధంగా సాగింది. అయితే హై పిచ్ లో డైలాగులు పలకాల్సి వచ్చినపుడు మాత్రం చిరు ఇబ్బంది పడ్డాడు. ప్రేక్షకులనూ ఇబ్బంది పెట్టాడు. చిరు గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ చక్కగా సరిపోయారు. తన నట కౌశలాన్ని చూపించే అవకాశం ఆయనకు పెద్దగా రాలేదు. ఐతే కళ్లలో ఇంటెన్సిటీ చూపించి తన స్థాయిని చాటుకున్నారు. నయనతార కనిపించేది తక్కువ సేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. తమన్నా ఆమె కన్నా కీలక పాత్రలో మెప్పించింది. ‘సైరా’ టైటిల్ సాంగ్ లో ఆమె హావభావాలు - స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. కిచ్చా సుదీప్ తన ప్రత్యేకత చాటుకున్నాడు. విజయ్ సేతుపతి పాత్రకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. ఉన్నంతలో ఓకే. జగపతిబాబు ఆకట్టుకున్నాడు. విలన్ పాత్రల్లో చేసిన బ్రిటిష్ నటులిద్దరూ మెప్పించారు. ఆ పాత్రలకు వాళ్లు చక్కగా సరిపోయారు. సాయిచంద్.. రోహిణి సెంటిమెంటు పండించడంలో విజయవంతమయ్యారు. రఘుబాబు - బ్రహ్మాజీ - పృథ్వీ.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.
సాంకేతిక వర్గం:
‘సైరాా’లో పాటలకు ప్రాధాన్యం తక్కువే. అయితే కథను నడిపించేందుకు చక్కగా ఉపయోగపడ్డ ‘సైరా’ టైటిల్ సాంగ్ తెరమీద అద్భుతంగా అనిపిస్తుంది. ఆ పాట టైమింగ్ - దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగున్నాయి. జాగో నరసింహారెడ్డి పాట విజువల్ గ్రాండియర్ తో ఆకట్టుకుంటుంది. పాటల విషయంలో అమిత్ త్రివేది న్యాయం చేయగా.. బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతను జులియస్ పకియం చక్కగా నిర్వర్తించాడు. సినిమా నిండా రోమాంచిత సన్నివేశాలకు లెక్కే లేదు. ఆ సన్నివేశాల్లో అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరింత ఉద్వేగం తీసుకురావడంలో జులియస్ విజయవంతం అయ్యాడు. చివరి 20 నిమిషాల్లో నేపథ్య సంగీతం మరింతగా ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ - టాలీవుడ్ టెక్నీషియన్లు కలిసి తీర్చిదిద్దిన యాక్షన్ ఘట్టాలు కూడా గొప్పగా ఉన్నాయి. కోట మీద దాడి ఎపిసోడ్ అంతా బాగానే సాగినా.. చివర్లో కొంత హడావుడిగా ముగించినట్లు అనిపిస్తుంది. మిగతా యాక్షన్ ఘట్టాలన్నీ అద్భుతంగా తీర్చిదిద్దారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువల గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడా రాజీ లేదు. చాలా చోట్ల అవసరానికి మించి భారీతనం కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. సాయిమాధవ్ బుర్రా మాటలు తూటాల్లా పేలాయి. ఉరికంబం ఎక్కే ముందు నరసింహారెడ్డి చెప్పే మాటలు అత్యంత ప్రభావవంతంగా అనిపిస్తాయి. సాయిమాధవ్ స్థాయి ఏంటో అక్కడ కనిపిస్తుంది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి చరిత్రను ఎంత వరకు అనుసరించాడు.. ఉయ్యాలవాడకు ఎంత వరకు న్యాయం చేశాడన్నది పక్కన పెడితే.. ‘సైరా’ను జనరంజకంగా తీర్చిదిద్దడంలో మాత్రం విజయవంతం అయ్యాడు. ఇలాంటి సినిమాను ఇతను డీల్ చేయగలడా అని సందేహించిన వాళ్లకు సమాధానం చెప్పాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ఎపిసోడ్లను తీర్చిదిద్దుకోవడంలో.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇవ్వడంలో సురేందర్ సక్సెస్ అయ్యాడు.
చివరగా: సైరా నరసింహారెడ్డి.. చరిత్రకు మసాలా
రేటింగ్-3/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre