Begin typing your search above and press return to search.

సంపూ మీద సింపతీ

By:  Tupaki Desk   |   20 May 2017 7:56 AM GMT
సంపూ మీద సింపతీ
X
హృదయం కాలేయం తో తెలుగులో ఒక బర్నింగ్ స్టార్ పుట్టాడు అతనే సంపూర్ణేష్ బాబు. ఈ సినిమా నుండి సంపూ కి ఒక మోస్తరు స్టార్ కామెడీ హీరోగా గుర్తింపు వచ్చింది. డైరెక్టర్ స్టీవెన్ శంకర్ (సాయి రాజేష్) చాల తెలివిగా ఈ సినిమాను ప్రచారం చేసారు అలానే సంపూర్ణేష్ తో బాగానే బిజినెస్ చేసారు. ఇప్పుడు బర్నింగ్ స్టార్ కొత్త సినిమా వస్తుంది అదే కొబ్బరి మట్ట.

ఇప్పుడు ఈ సినిమా ప్రచారం లో భాగంగా ఒక వెబ్ చానెల్ ఇంటర్వ్యూలో తన అసలు జీవితం గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. అందరు అనుకున్నట్లు నా పేరు సంపూర్ణేష్ కాదు నరసింహాచారి. నేను ఏమి బాగా డబ్బులు ఉన్న ఎన్ ఆర్ ఐ ను కాను మాది చాల పేద కుటంబం అని చెప్పాడు. అందులో అతని చూపించిన ఫోటోస్ చూసి చాలామంది ఆశ్చర్య పోయారు. దీనితో సోషల్ మీడియాలో కొత్త బర్న్ సృష్టించాడు సంపూ.ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ ఒక్కసారిగా వేరేలా మారింది. అయితే ఇప్పుడు ఈ సింపతీ కొత్తగా వర్కవుట్ అయ్యే ఛాన్సుంది.

తాజాగా కొబ్బరి మట్ట సినిమా లో 'ఆండ్రోయిడు' అనే పాటను విడుదల చేసారు. ఇప్పటికే సినిమా పోస్టర్ తో మంచి పాపులారిటీ వచ్చింది ఇప్పుడు తన బ్యాక్ గ్రౌండ్ చెప్పి అందరిలో ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పరిచాడు. ఇది కూడా ఒకరకంగా సినిమాకు ప్లస్ అయ్యింది అని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. అనుకోని విధంగా సినిమా మార్కెట్ పెరిగి బిజినెస్ అయ్యిందట. అయినా సింపతీతో సినిమా కొంటం ఏంటండీ బాబూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/