Begin typing your search above and press return to search.
సమంతకు వచ్చిన మయోసైటిస్ లక్షణాలు ఇవే!
By: Tupaki Desk | 30 Oct 2022 8:36 AM GMTతానున కొన్ని నెలలుగా ఆటో ఇమ్యూనిటీ డిజార్టర్ మయోసైటిస్ (కండరాలకు సంబంధించిన వ్యాధి) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రముఖ సినీ నటి సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నానని సమంత తెలిపింది.
ఈ నేపథ్యంలో మయోసైటిస్ వ్యాధి లక్షణాలపై చర్చ జరుగుతోంది. ఇది ఒక అరుదైన వ్యాధి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి లక్ష మంది ప్రజల్లో నలుగురికి ఈ వ్యాధి వస్తుందని అంటున్నారు. ఇమ్యూనిటీ డిజార్డర్‌తో మొదలై తీవ్ర బలహీనత, కండరాల నొప్పులతో తీవ్ర నరకం చూపుతుందని అంటున్నారు. శరీరంలోని వివిధ కండరాలపై మయోసైటిస్ తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్సను ప్రారంభించాలని అని చెబుతున్నారు. మయోసైటిస్ ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుందని వివరిస్తున్నారు. పాలీమయోసైటిస్, డెర్మటోమయోసైటిస్, ఇన్‌క్లూజివ్ బాడీ మయోసైటిస్ రూపంలో ఇవి ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు.
వీటిలో పాలిమయోసైటిస్ భుజాలు, తుంటి ఎముకలు, తొడ కండరాలపై ప్రభావం చూపుతూ తీవ్ర బాధకు గురి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ వ్యాధి 30 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపున్న ఆడవారిలో కనిపిస్తుంది. ఇది సోకినవారు చిన్న చిన్న పనులకే అలసిపోతారని.. కొంతదూరం నడిచినా త్వరగా నీరసించిపోతారని చెబుతున్నారు. ఒక్కోసారి పట్టు తప్పి కింద కూడా పడిపోవచ్చని వివరిస్తున్నారు.
డెర్మటోమయోసైటిస్‌లో చిన్న పిల్లలు, ఆడవారిలో ప్రధాన కండరాలతోపాటు చర్మంపై దద్దుర్లు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడతారని వైద్యులు వివరిస్తున్నారు.
అలాగే ఇన్‌క్లూజివ్ బాడీ మయోసైటిస్‌లో తొడ, అరచేతి మోకాళ్లు, మోచేతి కండరాలపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఇన్‌క్లూజివ్ బాడీ మయోసైటిస్ ముదిరితే ఆహారాన్ని మింగడం కూడా కష్టంగా మారుతుందని వివరిస్తున్నారు.
రక్త, మూత్ర పరీక్షలతోపాటు ఎంఆర్‌ఐ, మజిల్ బయాప్సీ ద్వారా వ్యాధి లక్షణాలను నిర్ధారిస్తారని చెబుతున్నారు. లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు.
వాటర్ బాటిల్ మొదలుకుని కుర్చీలు ఇలా చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేని పరిస్థితులు ఉంటే దాన్ని మయోసైటిస్‌గా అనుమానించాల్సి ఉంటుందని చెబుతున్నారు. చిన్న చిన్న బరువులు ఎత్తడానికి కూడా చేతులు సహకరించవని.. చేతులు పైకి లేవవని వివరిస్తున్నారు.
మయోసిటిస్ స్థితిని నిర్ధారించడం.. చికిత్స అందించడం కొంచెం కష్టమని వైద్యులు చెబుతున్నారు. నయం కాని వ్యాధిగా దీనికి పేరుందని అంటున్నారు. దీనికి ప్రత్యేకమైన చికిత్సా విధానం లేదని పేర్కొంటున్నారు. కానీ, సరైన మందులు, పద్ధతిగా థెరపీలతో వ్యాధి నుంచి ఉపశమనం పొందచ్చని పేర్కొంటున్నారు.