Begin typing your search above and press return to search.
లిటిల్ హీరోపై కుట్ర పన్నారు
By: Tupaki Desk | 10 July 2015 10:30 AM GMTఇది సినిమా కాదు నిజం. వాస్తవంలో జరుగుతున్న కుట్ర. హీరోపై విలన్ కుట్ర పన్నితే అది సినిమా. కానీ నిజజీవితంలో హీరోని ఎదగకుండా కుట్ర చేస్తే దాన్ని ఏమనాలి? కానీ ఇది నిజం. వాస్తవ జీవితంలోనూ ఓ హీరోపై కుట్ర జరిగింది. ఆ సంగతిని ఆ హీరో తండ్రే చెప్పడం గమనార్హం. నా కొడుకుపై భారీ కుట్ర జరుగుతోంది. అతడు నటించిన సినిమాల్ని రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నారని శింబు తండ్రి టి.రాజేంద్రన్ ఆరోపించారు.
ప్రస్తుతం 'వాలు' రిలీజ్ కోర్టు పరిధిలో ఉంది. ఈ సినిమా కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రిలీజ్ హక్కుల్ని 10 కోట్లు చెల్లించామని మ్యాజిక్ రేస్ అనే సంస్థ పిటీషన్ ఫైల్ చేసింది. మాకు ఇవ్వకుండా వేరే వారికి రైట్స్ ఇస్తారా అంటూ కేసేసింది. కేసు 13వ తేదీకి వాయిదా వేసింది. దీనివల్ల 17న రిలీజ్ కానున్న వాలు రిలీజవుతుందా? లేదా? అన్న సందిగ్ధం కొనసాగుతోంది. అసలే కష్టాల్లో రిలీజ్. రాక రాక వస్తోంది. ఇప్పటికైనా బైటపడుతోంది అనుకుంటే ఇంతలోనే కోర్టు కేసు. తట్టుకోలేక రాజేంద్రన్ ఇలా కుట్ర అంటూ రచ్చకెక్కారు.
శింబు-హన్సిక జంటగా 'వాలు' చిత్రం ఎన్నో కష్టాల మధ్య తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఓవైపు హన్సికతో ప్రేమలో వైఫల్యం ఎదుర్కొన్న శింబు, కెరీర్ పరంగానూ పతనంలో ఉన్నాడు. ఓ వైపు వ్యక్తిగత జీవితం, మరోవైపు వృత్తిగత జీవితం రెండూ నాశనమయ్యాయి. పరిశ్రమలో అతడంటే గిట్టనివారంతా పెద్ద రేంజులో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇందులో మీడియా కూడా తమవంతు పాత్ర పోషిస్తోందని టి.రాజేంద్రన్ ఆరోపిస్తున్నారు.