Begin typing your search above and press return to search.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దృష్టి పెట్టిన టి - సిరీస్!
By: Tupaki Desk | 3 Feb 2022 11:30 PM GMTసినిమాలతో .. పాటలతో పరిచయం ఉన్నవారికి 'టి - సిరీస్' గురించి తెలియకుండా ఉండదు. మ్యూజిక్ పరంగాను .. సినిమాల నిర్మాణం పరంగాను వాళ్లు తమ అభిరుచిని చాటుతూ వచ్చారు. ఇటీవల కాలంలో భారీ సినిమాలను నిర్మిస్తూ తమ బ్యానర్ స్థాయిని మరింతగా పెంచడంలో వారు సక్సెస్ అయ్యారు. అలాంటి ఈ సంస్థ .. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దృష్టి పెట్టింది. డిజిటల్ కంటెంట్ ను పెద్ద ఎత్తున రెడీ చేసి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి ఇవ్వనుంది. ఇప్పుడు ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయి.
ఒకప్పుడు సినిమా పట్టణాల సరిహద్దులు దాటుకుని టౌన్లకి రావడానికి చాలా రోజులు పట్టేది. పనుల మీద టౌన్లకి వచ్చేవారు, తమ పని పూర్తిచేసుకుని సినిమా చూసేసి ఇంటికి చేరుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సినిమా కోసమే వెళ్లి సినిమా చూడవసరం లేకుండా పోయింది. పని చేసుకుంటూ .. ప్రయాణం చేస్తూ .. ఎలాగైనా అరచేతిలో సినిమాను చూసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీ రావడంతో ఇప్పుడు ఒంటరితనం అనేదే లేకుండా పోయింది.
అందువల్లనే నిన్నమొన్నటి వరకూ టీవీ సీరియల్స్ నిర్మించిన సంస్థలు .. సినిమా బ్యానర్లు అన్నీ కూడా ఇప్పుడు డిజిటల్ కంటెంట్ పై దృష్టి పెట్టాయి. వెబ్ సిరీస్ లు .. వెబ్ షోలు .. ఓటీటీ సినిమాలు .. నిర్మిస్తూ వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో టి - సిరీస్ వారు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ఓటీటీ కంటెంట్ ను అందించడంలో తమ ప్రత్యేకతను చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే ఓటీటీ కంటెంట్ అను అందించే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా టి - సిరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ చెప్పారు.
మొదటి నుంచి కూడా మేము పాటలకి ప్రాధాన్యతనిస్తూ వచ్చాము. సినిమాల నిర్మాణ సమయంలోను పాటల ప్రాధాన్యత తగ్గకుండా చూసుకున్నాము. యూ ట్యూబ్ కంటెంట్ కూడా అందించాము. ఇక ఇప్పుడు ఓటీటీ కంటెంట్ పై దృష్టిపెట్టాము. మారుతున్న కాలమాన పరిస్థితులకు తగిన విధంగా కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నాము. అందుకోసం అనుభవజ్ఞులతో చర్చలు జరపడం కూడా జరిగిపోయింది. యాక్షన్ థ్రిల్లర్లు .. బయోపిక్ లు .. మర్డర్ మిస్టరీలు .. ఇలా అన్నిరకాల కథలతో ఒరిజినల్ కంటెంట్ ను అందించడానికి సిద్ధమవుతున్నాము" అని చెప్పుకొచ్చారు.