Begin typing your search above and press return to search.
బాలీవుడ్ బడా సంస్థ తెలుగులోకి..
By: Tupaki Desk | 14 March 2018 5:30 PM GMTసినిమా పరిధి విస్తరించింది. మార్కెట్ పరిధీ పెరిగింది. దీంతో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు బాలీవుడ్ మీద దృష్టిపెడుతున్నాయి. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ లు దక్షిణాది సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ దక్షిణాదిన సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. దక్షిణాదిన నాలుగు భాషల్లో కలిపి ఒకేసారి సినిమా చేయడానికి ఆ సంస్థ సిద్ధమవుతుండటం విశేషం. తాము తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళంలో కలిపి ఓ సినిమా చేయబోతున్నట్లు టి-సిరీస్ సంస్థ ప్రతినిధి ప్రకటించాడు. ఐతే ఈ సినిమా బేస్ మాత్రం తెలుగేనట.
తెలుగు నటీనటులు.. సాంకేతిక నిపుణులతోనే తాము ఈ మల్టీ లాంగ్వేజ్ ఫిలిం చేయబోతున్నట్లు టి-సిరీస్ ప్రకటించింది. ఇంకో వారం పది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తారట. ఇంతకుముందు యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తమ బేనర్లో హిట్టయిన హిందీ సినిమా ‘బ్యాండ్ బాజా బారత్’ను తెలుగు-తమిళ భాషల్లో ‘ఆహా కళ్యాణం’ పేరుతో రీమేక్ చేసింది. ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగల్చడంతో మళ్లీ ఇటు వైపు చూడలేదు. ఇప్పుడు టీ-సిరీస్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. కొన్ని రోజుల కిందట టి-సిరీస్ గురించి టాలీవుడ్లో చర్చ జరిగింది. ‘అజ్ఞాతవాసి’కి స్ఫూర్తిగా నిలిచిన ‘లార్గోవించ్’ను హిందీలో రీమేక్ చేయడానికి హక్కులు తీసుకున్నది ఈ సంస్థే.