Begin typing your search above and press return to search.
`సైరా: నరసింహారెడ్డి`కి కళాబంధు సర్టిఫికెట్
By: Tupaki Desk | 15 Sep 2019 7:50 AM GMTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `సైరా-నరసింహారెడ్డి` ఎలా ఉండబోతోంది? `సాహో` లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తర్వాత వస్తున్న ఈ భారీ హిస్టారికల్ చిత్రంపైనా అదే స్థాయి ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 2 రిలీజ్ తేదీ .. అంటే ఇంకో 17 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మెగాభిమానుల్లో క్యూరియాసిటీ అంతకంతకు పెరుగుతోంది. అలాగే ట్రేడ్ వర్గాల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలింతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అంటే.. ఇప్పటికే దుబాయ్ కి చెందిన ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు సైరా ట్రైలర్ పై తొలి రిపోర్ట్ ను అందించారు. మెగాస్టార్ చిరంజీవి షో ఆద్యంతం మైమరిపిస్తారని ప్రశంసలు కురిపించారు. ఇప్పటికి ఇదే మొట్టమొదటి రిపోర్ట్.
ఆయన సంగతి సరే.. పరిశ్రమ ఇన్ సైడ్ ప్రముఖులు ఏమని అనుకుంటున్నారు? అంటే దానికి కళాబంధు.. మెగా నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి సెకండ్ రిపోర్ట్ ని అందించారు. ఆయన అందించిన రిపోర్ట్ ప్రకారం.. పరిశ్రమ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు-ఎగ్జిబిటర్ దిల్ రాజు.. మెగానిర్మాత కం పంపిణీదారుడు అల్లు అరవింద్ సైతం ఈ ప్రాజెక్టు సక్సెస్ పై ఎంతో నమ్మకంగా.. ధీమాగా ఉన్నారని తెలుస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో టీఎస్సార్ మాట్లాడుతూ-`` మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా- నరసింహారెడ్డి` పెద్ద హిట్టు కాబోతోంది. ఇది చాలా పవర్ ఫుల్ స్టోరితో తెరకెక్కింది. అల్లు అరవింద్- దిల్ రాజు నాతో ఈ మాట చెప్పారు. కథ బావుందని ఇంకా చాలా మంది ప్రముఖులు నాతో అన్నారు. అంతకుముందు చిరంజీవి చేసిన సినిమాలకు దీనికి చాలా తేడా ఉంది. కథ చాలా చక్కగా ఉంటుంది. చిరంజీవి బ్రిలియంట్ పెర్ఫామెన్స్.. రామ్ చరణ్ లావిష్ పెట్టుబడులు ఇవన్నీ పెద్ద ప్లస్ కానున్నాయి`` అని అన్నారు. మొత్తానికి సైరాపై చిత్రయూనిట్ కి సంబంధం లేని పర్సనాలిటీగా.. కళాబంధు సెకండ్ రిపోర్ట్ అందించారన్నమాట. 80లలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా పలు భారీ చిత్రాల్ని టీఎస్సార్ నిర్మించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిరుకి ఎంతో సన్నిహితుడిగా ఉన్నారు.