Begin typing your search above and press return to search.
తాప్సి మన హీరోల గురించి భలే చెప్పింది
By: Tupaki Desk | 29 April 2017 11:22 AM GMTటాలీవుడ్లో హీరోయిన్ గా పరిచయమై ఇక్కడ రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసి.. ఇక్కడ అవకాశాలు తగ్గిపోయా బాలీవుడ్ బాట పట్టిన భామ తాప్సి పన్ను. బాలీవుడ్ వెళ్లిపోయాక వీలు చిక్కినపుడల్లా టాలీవుడ్ మీద సెటైర్లు వేయడానికే చూసిన తాప్సి.. తాజగా ఒక ఇంటర్వ్యూలో ఇక్కడి హీరోల గురించి పాజిటివ్ గా మాట్లాడింది. తాను పని చేసిన హీరోల గురించి ఆసక్తికర కబుర్లు చెప్పింది. ఆమె తన హీరోల గురించి ఏం చెప్పిందో చూద్దాం పదండి.
తెలుగులో తన తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’ చేసే సమయానికి చాలా భయంగా ఉండేదని.. రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడితో పని చేయడంతో మరింత టెన్షన్ పడ్డానని.. ఐతే హీరో మనోజ్ రూపంలో మంచి ఫ్రెండు దొరకడంతో తన టెన్షన్ తగ్గిందని.. అతను క్రేజీ గాయ్ అని తాప్సి అంది. పెళ్లి తర్వాత కూడా అతను మారలేదని.. ఇప్పటికీ క్రేజీనే అని తాప్సి చెప్పింది. ఇక ‘వస్తాడు నా రాజు’లో మంచు విష్ణుతో జతకట్టి తాప్సి అతడి గురించి చెబుతూ.. తనో పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అంది. లాస్ అండ్ గెయిన్ థియరీని ఎప్పుడో ఔపాసన పట్టేశాడని తెలిపింది.
ప్రభాస్ తో పని చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ తనకెంతో నచ్చిన సినిమా అని.. ఇప్పటికీ టీవీలో వస్తే అది చూస్తూ ఉంటానని.. ప్రభాస్ సినిమాల్లో ఎంత కూల్ గా ఉంటాడో.. బయటా అంతే కూల్ అని కితాబిచ్చింది. ప్రభాస్ పేరు తలుచుకోగాని ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనిపిస్తుందని తాప్సి చెప్పింది. ‘వీర’.. ‘దరువు’ సినిమాల్లో తనతో జతకట్టిన రవితేజ చాలా ఎనర్జిటిక్ అని.. తనతో హిందీలోనే మాట్లాడేవాడని.. అందుకే ‘హిందీ పండిట్’ అని మాస్ రాజాను పిలిచేదాన్నని తెలిపింది.
‘సాహసం’.. ‘మొగుడు’ సినిమాల హీరో గోపీచంద్ లవ్లీ కోస్టార్ అని.. సెట్లో చాలా తక్కువ మాట్లాడతాడని.. ‘సాహసం’ సినిమా కోసం తాము చాలా కఠినమైన లొకేషన్లలో షూటింగ్ లో పాల్గొన్నామని చెప్పింది. ‘షాడో’ కథానాయకుడు వెంకటేష్ మాటల మధ్యలో భలే టైమింగ్ తో జోకులు వేస్తారని.. సింగిల్ లైన్ పంచులు వేయడంలో ఎవరైనా ఆయన తర్వాతే అని కితాబిచ్చింది. ఇక ‘బేబీ’.. ‘ఘాజీ’ సినిమాల కోస్టార్ రానా దగ్గుబాటి తాను హైదరాబాద్ వచ్చినట్లు తెలియగానే క్షణాల్లో ఫోన్ చేస్తాడని.. ఏం కావాలో చూసుకుంటాడని తాప్సి చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/