Begin typing your search above and press return to search.

సప్తగిరి తాప్సీలకు మధ్యే యుద్ధం

By:  Tupaki Desk   |   13 Jun 2019 6:58 AM GMT
సప్తగిరి తాప్సీలకు మధ్యే యుద్ధం
X
రేపు మరో శుక్రవారం రానుంది. మూడు బాషలు కలిపి చెప్పుకోవడానికి పన్నెండు సినిమాలు వస్తున్నాయి కాని అందులో విపరీతమైన ఆసక్తి రేపుతున్నవి తక్కువగా ఉండటం ట్రేడ్ ని కొంత ఆశ కొంత నిరాశలో ముంచెత్తుతోంది. తెలుగువరకు చూసుకుంటే విడుదలయ్యే నెంబర్ ను పక్కన పెడితే అంతో ఇంతో హైప్ తో వస్తున్న సినిమాలు రెండే. ఒకటి సప్తగిరి హీరోగా రూపొందిన వజ్రకవచధారి గోవిందా. రెండోది తాప్సి గేమ్ ఓవర్.

ఓపెనింగ్స్ కీలకంగా ఉండే మొదటి రోజు ఎడ్జ్ సప్తగిరి వైపే ఎక్కువగా ఉంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో అన్ని అంశాలు బాలన్స్ గా కూర్చినట్టు ఇంప్రెషన్ కలిగించడంతో హాస్య ప్రియులతో పాటు మాస్ ఆడియన్స్ వజ్రకవచదారి వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అందులోనూ సప్తగిరి గతంలో హీరోగా ఆల్రెడీ పాస్ అయ్యాడు. సప్తగిరి ఎల్ఎల్బి ఆశించిన ఫలితం అందుకొకపోయినా సప్తగిరి ఎక్స్ ప్రెస్ తాలుకు పాజిటివ్ వైబ్రేషన్స్ పబ్లిక్ లో ఉన్నాయి. అవి ఇప్పుడు వజ్రకవచధారి గోవిందాకు ప్లస్ గా మారుతున్నాయి

ఒకవేళ టాక్ కనక పాజిటివ్ గా వస్తే డీసెంట్ ఓపెనింగ్స్ తో పాటు రెండో రోజు నుంచే పికప్ ఆశించవచ్చు. మరోపక్క హారర్ కం సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న గేమ్ ఓవర్ మీద ఆ జానర్ ప్రియులు ఓ కన్నేసే ఛాన్స్ ఉంది. ఆనందో బ్రహ్మ నీవెవరో ద్వారా ఈ మధ్య తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న తాప్సీ ఇందులో అంతా తానై నటించడం ప్లస్ ట్రైలర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయనే మెసేజ్ ఇవ్వడం వెరసి ఓ వర్గం ప్రేక్షకుల మద్దతు దక్కకపోదు.

అయితే వజ్రకవచధారికి ముందు చెప్పినట్టు ఎడ్జ్ కాస్త ఎక్కువ ఉంది. గేమ్ ఓవర్ కనక టాక్ ని తనకు అనుకూలంగా తెచ్చుకుంటే లాభ పడవచ్చు. కాని ఇది డబ్బింగ్ సినిమా కావడం కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి రేపు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని సినిమాలు ఉన్నాయన్న కౌంట్ పక్కన పెడితే సప్తగిరికి మంచి అవకాశం అయితే దొరికింది. దీన్నెలా వాడుకుంటాడో రేపు తేలిపోతుంది