Begin typing your search above and press return to search.
నాపై నేను సెటైర్ వేసుకున్నా-తాప్సి
By: Tupaki Desk | 15 July 2017 7:43 AM GMTఒకసారి నోరు జారాక తప్పు ఒప్పుకుని సారీ చెప్పేస్తే అక్కడితో వివాదం సద్దుమణిగిపోతుంది. అలా కాకుండా సమర్థించుకోజూస్తే వివాదం మరింత పెద్దదవుతుంది. అసలే తప్పు చేసి.. ఆ తర్వాత సమర్థింపా అంటూ జనాల్లో అవతలి వ్యక్తి మీద వ్యతిరేకత మరింత పెరిగిపోతుంది. సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్ను విషయంలో ఇదే జరిగింది. తన తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం’లో రాఘవేంద్రరావు మార్కు రొమాన్స్ విషయమై సెటైర్లు వేసిన తాప్సి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.
దీనిపై టాలీవుడ్ ప్రముఖుల నుంచి సామాన్య ప్రేక్షకుల దాకా తాప్సి వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఐతే తాను రాఘవేంద్రరావుపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. తానేమీ తప్పు మాట్లాడలేదని.. రాఘవేంద్రరావు సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని తాప్సి ఇచ్చిన వివరణ దర్శకేంద్రుడి అభిమానుల్ని ఏమాత్రం సంతృప్తి పరచలేదు. ఆమె మీద దాడి మరింత తీవ్రమైంది.
దీంతో తాప్సి దిగి వచ్చింది. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పింది. తాను దర్శకేంద్రుడిపై సెటైర్లు వేయలేదని.. తన మీద తానే సెటైర్ వేసుకున్నానని తాప్సి చెప్పింది. దర్శకేంద్రుడిని అవమానించే ఉద్దేశం తనకెంతమాత్రమూ లేదని చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది తాప్సి. తన కెరీర్ రాఘవేంద్రరావుతోనే మొదలైందని.. ఆయన వల్లే తనకు ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చిందని చెప్పింది.
ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తనకు రాఘవేంద్రరావు ఇచ్చిన అవకాశమే కారణమని.. అలాంటిది ఆయన్ని ఎలా అవమానిస్తానని తాప్సి చెప్పింది. తాను ‘ఝమ్మంది నాదం’ తరహా సినిమాలకు సరిపోనని.. అందులోని రొమాంటిక్ సీన్స్ చేయడం తనకు ఇబ్బంది అయిందని చెబుతూ.. తన మీద తాను సెటైర్లు వేసుకున్నా తప్ప రాఘవేంద్రరావును అవమానించాలన్నది తన ఉద్దేశం కాదని.. ఈ విషయంలో తనకే దురుద్దేశం లేనప్పటికీ.. ఆ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని తాప్సి వివరించింది.