Begin typing your search above and press return to search.

బెబోకే పొగ పెట్టేట్టుందిరో!

By:  Tupaki Desk   |   23 Aug 2018 5:31 AM GMT
బెబోకే పొగ పెట్టేట్టుందిరో!
X
`ఝుమ్మందినాదం` సినిమాతో టాలీవుడ్‌ లో ప్రవేశించిన తాప్సీ ఇంకా అదే రూపంతో తెలుగువారి క‌ళ్ల‌లో అలానే ఉంది. కానీ ఇదిగో లేటెస్ట్ తాప్సీని చూస్తే మాత్రం షాక్ తిన‌కుండా ఉండ‌లేరు. గుండె గుభేల్‌మంటుంది. అస‌లింత‌కీ ఆ తాప్సీనే ఈ తాప్సీనా? అంటూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం గ్యారెంటీ. అరే .. తిండి క‌ట్టేసిందా? ఒక పూటే తింటోందా? ఎందుకీ ఉపవాసాలు? అస‌లేమైంది అందాల తాప్సీకి? అని మీలో మీరే గొణుక్కుంటారు!

అంతాగా ఏం మారింది? అంటారా.. నిన్న‌టిరోజున `నీవెవ‌రో` ప్ర‌మోష‌న్‌ కి హైదరాబాద్ విచ్చేసిన తాప్సీని చూసిన‌వారికి ఇలాంటి సందేహ‌మే క‌లిగింది. అస‌లేమైంది తాప్సీకి? ఇంత‌లోనే ఎంత మార్పు? ఎందుకిలా అయిపోయింది? అంటూ ఒక‌టే మంత‌నాలు సాగాయి. ద‌గ్గ‌ర‌గా చూస్తే తాప్సీ గాలికి ఎగిరిప‌డేలా క‌నిపించింది. పేల్ & లీన్ టామ్ లా క‌నిపించి షాకిచ్చింది. దీంతో ఫిలింమీడియాలోనూ ఒక‌టే గుస‌గుస‌లు మొద‌లైపోయాయ్‌. అస‌లింత‌కీ ఏమైంది తాప్సీకి?

ఉన్న‌ట్టుండి జీరోసైజ్ పిచ్చి ప‌ట్టుకుందా? బెబో ఏమైనా క‌రిచిందా? అంటూ తెగ గుస్సాయించారు జ‌నం. జీరోసైజ్‌ కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ గా సెటిలైన బెబోకే తాప్సీ ప‌గ పెట్టాల‌నుకుంటోందా? బాలీవుడ్ వెళ్లాక‌.. అక్క‌డ అంతా త‌న‌కి అచ్చి వ‌చ్చింది. ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. ఇటీవ‌ల పింక్ - జుడ్వా 2 చిత్రాల‌తో బ్లాక్‌ బ‌స్ట‌ర్లు కొట్టేసింది. నామ్ ష‌బానా - ముల్క్ చిత్రాల‌తో న‌టిగా 200శాతం మార్కులేయించుకుంది. అందుకే రెట్టించిన కాన్ఫిడెన్స్‌ లో ఏదో చేసేయ‌బోయి - ఇంకేదో అవుతోందేమో! అన్న సందేహాలు అభిమానుల‌కు క‌లుగుతున్నాయ్‌! అస‌లింత‌కీ ఏం చేస్తోంది తాప్సీ?