Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ప్రముఖుల హ్యూమానిటీ
By: Tupaki Desk | 28 March 2020 1:30 AM GMTకరోనా సామాన్య జనాలపై ముఖ్యంగా రోజు వారి కూలీలపై విపరీతంగా ప్రభావం చూపుతున్న విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలు కనీసం తిండి లేక ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తో రోజువారి పనులు చేసుకునే వారు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. రెక్కాడితే కాని డొక్కాడని వారు ఇప్పుడు ఒక్క పూట బోజనం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం బాలీవుడ్ ప్రముఖులు ఐ స్టాండ్ విత్ హ్యుమానిటీ అంటూ ప్రతిజ్ఞ చేశారు.
బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహాన్.. ఆయుష్మాన్ కురానా.. తాప్సిలతో పాటు ఇంకా పలువురు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల సాయంకు ముందుకు వచ్చారు. వారికి 10 రోజులకు సరిపడ ఆహారపు పదార్థాలను అందించేందుకు సిద్దం అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ అసోషియేషన్ ద్వారా ఈ సాయంను చేసేందుకు ముందుకు వచ్చారు.
సినీ ప్రముఖులు ఇంకా టీవీ రంగానికి చెందిన వారు ఇందుకోసం విరాళాలు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. ఐ స్టాండ్ విత్ హ్యూమానిటీ అంటూ తారలు ముందుకు రావాలంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.