Begin typing your search above and press return to search.

తాప్సీ తెలివిగా చెప్పుకొచ్చిందే!

By:  Tupaki Desk   |   28 Aug 2018 6:26 AM GMT
తాప్సీ తెలివిగా చెప్పుకొచ్చిందే!
X
మొన్న శుక్రవారం విడుదలైన నీవెవరో ఫలితం అంతంత మాత్రంగానే వచ్చినా అందులో నటించిన వాళ్లకు మాత్రం మంచి పేరే వచ్చింది. బాలీవుడ్ లో సెటిలైపోయి అడపాదడపా తెలుగు సినిమాలు చేస్తున్న హీరోయిన్ తాప్సీ నీవెవరో ప్రమోషన్ కోసం తప్ప వేరే కారణం మీద హైదరాబాద్ వచ్చిన దాఖలాలు లేవు. తాజాగా ఒక ఇంటర్వ్యూ;లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తాప్సీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన తన నుంచి ఈ ఇష్యూ మీద మాట్లాడాలని చాలా మంది ఎదురు చూసారని కానీ తనకు అనుభవంలోకి రాని వాటి గురించి తాను ఎలా మాట్లాడగలను అని చెప్పి స్మార్ట్ గా తప్పుకుంది. పైగా తాను పరిచయమయ్యింది తర్వాత నటించింది అన్ని పెద్ద బ్యానర్లు పేరున్న హీరో దర్శకుల సినిమాల్లో అని అలాంటప్పుడు తనకు కాస్టింగ్ కౌచ్ గురించి తెలిసే అవకాశం ఎలా ఉంటుంది అని చెప్పింది. పిచ్చి వేషాలు వేసే ఛాన్స్ ఎవరికీ రాలేదట. భవిష్యత్తులో కూడా ఆ సమస్యే రాదు అంటోంది.

తాప్సీ అన్న మాటలో నిజం లేకపోలేదు. మొదటి సినిమానే దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ఝుమ్మంది నాదంతో పరిచయమై వెంకటేష్ లాంటి హీరోలతో షాడో లాంటివి చాలానే చేసింది. ఫలితాలు రాకపోయినా గట్టి ప్రయత్నాలే చేసింది. ఆ తర్వాత హిందీలో పింక్ తో మొదటి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు తన యాక్టింగ్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న తాప్సీ పర్సనల్ విషయాలు మాత్రం షేర్ చేయదట. ఒకవేళ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేయాల్సి వచ్చినా ఎవరికి చెప్పనని కుండబద్దలు కొట్టేస్తోంది. తాప్సీ కి ఈ ఏడాది అంతగా అచ్చిబాటు కావడం లేదు. బాలీవుడ్ లో చేసిన దిల్ జంగ్లీ-సుర్మా-ముల్క్ మూడు పేరు ఇచ్చాయి కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. తెలుగులో నీవెవరో సైతం అదే బాట పట్టింది. ఆశలన్నీ రాబోయే మర్మరాజియా-తడ్కా-బద్లాల మీదే పెట్టుకుంది. నీవెవరో తర్వాత టాలీవుడ్ లో ఇంకే సినిమా కమిట్ కాలేదు తాప్సీ .