Begin typing your search above and press return to search.
గ్లామర్ తప్ప ట్యాలెంట్ వాడుకోలేదంట
By: Tupaki Desk | 18 July 2016 5:02 AM GMTఈ జనరేషన్ లో సినిమా అంటే గ్లామర్ ఇండస్ట్రీనే. హీరోయన్స్ విషయంలో అయితే యాక్టింగ్.. ట్యాలెంట్.. లాంటి వన్నీ సెకండరీ. ఎంత ఎక్కువగా అందాన్ని ఆరబోస్తే అన్నేసి ఛాన్సులొస్తాయి. మెల్లగా ఓ రేంజ్ కి వెళ్లాక.. అప్పుడు తమ ట్యాలెంట్ చూపించి పేరు తెచ్చుకోవడం ఆనవాయితీ. ఒకరిద్దరు మినహాయిస్తే.. అందరికీ ఈ ప్రాసెస్ వర్తిస్తుంది. కానీ హీరోయిన్ తాప్సీ మాత్రం.. తన గ్లామర్ వాడుకుని తన గౌరవం మంట కలిపారంటోంది.
ప్రస్తుతం తాప్సీ హిందీలో చెప్పుకోదగ్గ సినిమాల్లో కీలకమైన రోల్స్ చేస్తోంది. అవన్నీ తనలోని ట్యాలెంట్ ని బయటకు తీసేవని కూడా చెబుతోంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఎవరూ తన నటనా ప్రతిభను ఉపయోగించుకోకుండా.. అందాలను మాత్రమే ఉపయోగించుకున్నారని చెబుతోంది. తమిళ్ లో ఆడుగళం వంటి కొన్ని మంచి సినిమాలు చేసినా.. సౌత్ అంతా తన అందాలకే ఇంపార్టెన్స్ ఇచ్చారని ఆరోపిస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో అయితే.. అందాలు ఆరబోయించే పాత్రలు మాత్రమే ఇచ్చారట. అందుకే ట్యాలెంట్ చూపించే ఛాన్స్ రాలేదంటోంది.
అప్పట్లో ఇండస్ట్రీపై ఎక్కువగా అవగాహన లేకపోవడంతోనే ఇలా గ్లామర్ పాత్రలు చేశానని తాప్సీ పన్ను అంటోంది. ఈమె చెప్పేది బాగానే ఉంది కానీ.. అసలు ఛాన్సులే లేకపోతే ట్యాలెంట్ చూపించే ఛాన్స్ ఎలా వస్తుందో కదా!!