Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ ను తిట్టిందా? పొగిడిందా?

By:  Tupaki Desk   |   5 Jun 2019 1:30 AM GMT
టాలీవుడ్‌ ను తిట్టిందా? పొగిడిందా?
X
టాలీవుడ్‌ కు 'ఝుమ్మంది నాధం' చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. ఈ అమ్మడు టాలీవుడ్‌ లో అదృష్టం కొద్ది ఆఫర్లు అయితే దక్కించుకుంది కాని అవి పెద్దగా సక్సెస్‌ అవ్వక పోవడం.. ఈమెకు స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌ లో అడుగు పెట్టింది. అక్కడ ఈ అమ్మడు మెల్ల మెల్లగా చిన్న చిన్న చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు దక్కించుకుంది. అమితాబ్‌ వంటి స్టార్స్‌ తో వరుసగా నటించే అవకాశం దక్కించుకుంది.

తాప్సి ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఉంటూ వస్తుంది. ముక్కు సూటిగా మాట్లాడే మనస్థత్వం తాప్సిది. అందుకే ఆమె మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లేడేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేస్తు ఉన్నా కూడా టాలీవుడ్‌ పై తనకు మమకారం ఉందని చెప్పుకొచ్చింది. తాజాగా సౌత్‌ లో హీరోయిన్స్‌ కు ఇచ్చే గౌరవ మర్యాదల గురించి తాప్సి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

టాలీవుడ్‌ లో హీరోయిన్స్‌ ను సెట్స్‌ లో అంతా ఒక దేవత మాధిరిగా చూస్తారు. హీరోయిన్స్‌ కు సెట్స్‌ లో అంతా కూడా హీరోయిన్స్‌ కు విపరీతమైన గౌరవం ఇస్తారు. కార్‌ వ్యాన్‌ దిగిన వెంటనే అంతా లేచి నిల్చుంటారు. అక్కడ నుండి వెళ్లి పోయే వరకు అలాగే నిల్చుని ఉంటారు. దాంతో హీరోయిన్స్‌ తామో గొప్ప అందగత్తెలము అనే అభిప్రాయంకు వచ్చేస్తారు.

అలా గౌరవించడం వల్ల గర్వం నెత్తికి ఎక్తి కొన్ని సార్లు అస్థిత్వంను కోల్పోయే పరిస్థితి వస్తుంది. హీరోయిన్స్‌ కు టాలీవుడ్‌ లో ఇచ్చే గౌరవంలో కనీసం బాలీవుడ్‌ లో సగం కూడా ఇవ్వరు అంటూనే తాను టాలీవుడ్‌ ను బాగా మిస్‌ అవుతున్నాను అంది. టాలీవుడ్‌ జనాలు ఇచ్చే గౌరవంను తాను మిస్‌ అవుతున్నట్లుగా కామెంట్స్‌ చేసింది. అందుకే వీలుంటే టాలీవుడ్‌ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇంతకు తాప్సి టాలీవుడ్‌ లో ఉన్న పద్దతిని తిట్టిందా పొగిడిందా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.