Begin typing your search above and press return to search.
తాప్సీ... నువ్వు గ్రేటంతే!
By: Tupaki Desk | 14 May 2016 5:30 AM GMTరానా... తాప్సిల ఘాజి నిన్న మొన్ననే షురూ అయినట్టు అనిపించింది కానీ అప్పుడే డబ్బింగ్ కొచ్చేసింది ఆ సినిమా. అయినా... ఇప్పుడు పోస్టు ప్రొడక్షన్ వ్యవహారాలు ఇంతకుముందులా కాదు లెండి. ఇదివరకైతే సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాకే పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టేవాళ్లు. డబ్బింగ్ - ఎడిటింగ్ - మిక్సింగు - డిఐ ఇలా అన్నీ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాకే చేసేవాళ్లు. కానీ ఈమధ్య ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటున్నారు. డబ్బింగ్ కూడా ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు చెప్పేస్తున్నారు స్టార్లు. ఘాజీ పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా అలాగే జరుగుతున్నాయేమో తెలియదు కానీ.. తాప్సి ప్రస్తుతం ఆ సినిమాకి డబ్బింగ్ చెబుతోంది. హిందీ - తెలుగు రెండు భాషల్లోనే సొంత గొంతునే వినిపిస్తుందట. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది భామ.
ఎంతైనా ఆ విషయంలో తాప్సి గ్రేట్ అని చెప్పాల్సిందే. ఆమె తెలుగుకి దూరమై ఎన్ని రోజులైందో. కానీ భాషని మాత్రం ఇంకా మరిచిపోలేదు. అందుకే ఇప్పుడు డబ్బింగ్ చెప్పగలుగుతోంది. హిందీ అమ్మాయిలు కూడా అలవోకగా తెలుగు నేర్చుకోవచ్చని, డబ్బింగ్ కూడా చెప్పుకోవచ్చని మొదట చాటి చెప్పింది తాప్సినే. ఆమె మిస్టర్ పర్ ఫెక్ట్ కే డబ్బింగ్ చెప్పేసింది. ఆ తర్వాత కూడా నాలుగైదు సినిమాల్లో సొంత గొంతునే వినిపించింది.
ఇప్పుడు ఘాజిలోనూ ఆమె చిలుక పలుకులు వినొచ్చన్నమాట. సబ్ మెరైన్ నేపథ్యంలో జరిగే కథ ఇది. తాప్సి ఓ శరణార్థిగా కనిపించబోతోందట. రానా నేవీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ఇద్దరూ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా తాప్సి ఈ సినిమా తర్వాత తెలుగు అవకాశాలు అందుకోవాలని ట్రై చేస్తోంది. మరి ఆమె కోరిక తీరుతుందో లేదో చూడాలి.